జగన్ పై అవినీతి మరకలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇదే

వైఎస్ జగన్ పేరు వినగానే ఆంధ్ర రాజకీయాల్లో రెండు రకాల వాదనలున్నాయి. ఆయన డైనమిక్ లీడర్.. పులిబిడ్డ అని అభిమానులు అంటారు. వ్యతిరేకులు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు కొట్టేశారని విమర్శలు చేస్తారు. పదే పదే జగన్ అవినీతిపరుడు అంటూ విమర్శలు చేస్తున్నవారికి సోషల్ మీడియా వేదికగా జగన్ అభిమాని ఒకరు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. 10 పాయింట్లను పొందుపరుస్తూ ఈ పోస్టును చేశారు. జగన్ అభిమాని పోస్టును యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం. చదవండి.

 

జగన్ లాంటి అవినీతి పరుడ్ని ఎందుకు అభిమానిస్తున్నావు అని నన్ను ఫేస్ బుక్ లో స్నేహితులు అడుగుతుంటారు..

వాళ్ళకి ఇదే నా సమాధానం :-

(అవినీతి పరుడు అనేది అభియోగమే తప్ప ఇంతవరుకు ఏ ఒక్క కేసు నిరూపణ అవ్వలేదు మరియు ఏ కోర్టు చెప్పలేదు)

ఇష్టానికి గల కారణాలు ఇవే :-

1) 9 ఏళ్లుగా అధికారంలేకపోయినా ప్రజల మద్య నే నిత్యం ఉంటూ ఆయన పడుతున్న తపన,

2) తండ్రి చనిపోయి రాజకీయ ఏకాకిగా మారినా కోల్పోని ఆయన ఆత్మస్ధైర్యం,

3) నియంత అని పక్కపార్టీలన్నీ ఎగతాళి చేస్తున్న పట్టించుకోని ఆయన కృంగిపోని నైజం.

4) కాంగ్రెస్, టిడిపి కలిసి కుట్ర పన్ని అన్యాయం గా అక్రమ కేసులు పెట్టినా జైలుకి వెళ్లి కూడా భయం. బెరుకు లేకుండా తరువాత రోజు నుండే జనాల్లో తిరిగిన ఆయన తెగింపు.

5) ఆస్తుల్ని ఈడీ జప్తు చేస్తున్నా కూడా కంగారుపడి ఇంట్లో కూర్చొకుండా ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించిన ఆయన విధానం.

6 ) 2014 లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా కూడా సింగిల్ గా పోటీ చేసి గట్టిపోటి ఇచ్చిన ఆయన ధీరత్వం.

7) తనపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు రోజుకొకరిగా అమ్ముడుపోతున్నా కంగారు పడకుండా వెళ్లేవాళ్లు వెళ్లిపోవచ్చు don’t care అని చెప్పగలిగిన ఆయన గుండెధైర్యం.

8.) 3000 Km’s మండు వేసవిలో సైతం రికార్డ్ స్ధాయిలో పాదయాత్ర చేస్తూ ఆయన చూపిస్తున్న మొండితనం,

9) 9 ఏళ్లు గడుస్తున్నా కూడా ఏ నాయకుడికి లేనివిధంగా ఇప్పటికి తండోపతండాలుగా జనం వస్తున్నారు అంటే ఆయనకు ఉన్న ప్రజాదరణకి నాకు నచ్చే ఆంశం.

10) ఒక్కసారి మనిషిని గుర్తుపెట్టుకుంటే ఆరునెలల తరువాత కూడా ఆ మనిషిని పేరు పెట్టి పిలిచేంతంగా ఆయనకి ఉన్న జ్ఞాపకశక్తి,

ప్రతిమనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. దానిని అందుకునే మార్గంలో కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు ,ముళ్లు అన్ని ఉంటాయి. 
అవన్ని డోంట్ కేర్ అన్నట్టు లక్ష్యం వైపు గురిపెట్టగల ఛాంపియన్.

కేవలం లక్ష్యం మాత్రమే కంటిముందు కనబడాలి దానికి ఎంతైనా శ్రమించాలి అనే సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తిగా జగన్ అంటే ఇష్టం.

నేను జగన్ లోని మొండితనాన్ని ఇష్టపడతా….

అందుకే 
నేను మెచ్చే రియల్ హీరో…. వై ఎస్ జగన్ …