ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం అమలు విషయంలో తాను అస్సలు తగ్గనని క్లారిటీ ఇచ్చేశారు. మూడు రాజధానుల నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం చేయాలని జగన్ అనుకుంటున్నారు. జగన్ వజ్రోత్సవ సంబరాల వేదిక సాక్షిగా చెప్పిన మాటల వల్ల ఏపీ ప్రజలు సైతం జగన్ ఆలస్యంగానైనా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారని ఫిక్స్ అయ్యారు.
వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరగకూడదని జగన్ భావిస్తుండగా జగన్ మాటల్లో కూడా నిజమే ఉందని పలువురు చెబుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం ద్వారా జగన్ సర్కార్ ఇప్పటికే ప్రజల హృదయాలను గెలుచుకుంది. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని జగన్ భావిస్తున్నారు. విశాఖ పాలనా రాజధాని అయితే అమరావతికి క్రేజ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది.
అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయడం సులువు కాదు. అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల చట్టం చేసి కోర్టు నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా జగన్ జాగ్రత్త పడితే మాత్రమే మూడు రాజధానుల నిర్ణయం అమలు దిశగా అడుగులు పడతాయి. అతి త్వరలో విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు కానుంది. ఈ నిర్ణయం అమలుతో విశాఖనే పాలనా రాజధాని అని జగన్ చెప్పకనే చెబుతున్నారు.
అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కాకుండా టీడీపీ లేదా జనసేన అధికారంలోకి వస్తే జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరు. అప్పుడు మళ్లీ ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఫిక్స్ అవుతుంది. 2024 ఎన్నికలకు మరో 19 నెలల సమయం మాత్రమే ఉంది. రాజధాని విషయంలో సమయం వృథా చేయడం వల్ల ఏపీలో అభివృద్ధి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.