జగన్ యాత్రలో అపశ్రుతి: కాపులు తిరుగబడుతున్నారు

 (లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

వైసిపి నేత జగన్ మీద కాపులు తిరగబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కాపురిజర్వేషన్ల  సాధ్యం కాదని చేసిన ప్రకటన కాపులలో బాగా అసంతృప్తి రేకెత్తించింది. చాలా చోట్ల కాపులు సమావేశమయి ఈ విషయం మీదచర్చించారు.  ఆగ్రహంతో ఉన్న కాపు కుర్రాళ్లు జగన్ యాత్రను అడ్డుకోడ్డని సోషల్ మీడియాలో పిలుపు నిచ్చారు. మూడేళ్ల  పాటు నిర్ద్వంద్వంగా కాపు రిజర్వేషన్లను, రిజర్వేషన్ల పోరాాటాన్ని సమర్థించిన జగన్ ఒక్క సారిగా  రాష్ట్ర పరిధిలో ఈ  అంశం లేదేని, అందువల్ల కాపు కోటా మీద హామీ ఇవ్వలేనని కిర్లంపూడి మండలం నుంచే ప్రకటించడం జీర్ణించుకోలేక పోతున్నారు వారు.  చాలా చోట్ల జగన్ ప్రజాసంకల్పయాత్ర కు అపుడే నిరసన చెబుతున్నారు. ఇంతవరకు ఆయన యాత్రకు నిరసన జెండాలు, నల్ల జండాలు ఎదురుకాలేదు. గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో మాత్రం కొంతమంది పిచ్చివాళ్లు జగన్ యాత్ర చేసిన వెళ్తిపోయాక ఆ రోడ్డుని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.

జగన్ కాపు రిజర్వేషన్ల గురించి తాను చాలా తెలివిగా క్లారిటీ ఇచ్చాననుకుంటున్నారు. అదిక్లారిటీ కాదు. ఒక రాజకీయ ప్రకటన.  అయితే, ఆది బెడిసికొట్టిందనక తప్పదు. రాజకీయ నాయకుడు మొదట చేయకూడని పని ‘నో’ అని చెప్పడం.  ఎందుకంటే, తాము నాయకుడు అని భావించిన వ్యక్తి నుంచి ‘నో’ సమాధానం వినేందుకు ప్రజలు ఇష్టపడరు. డిమాండ్లు, పోరాటాలు, ఆందోళనలు వచ్చేది రాష్ట్రాల పరిధిలో  లేని అంశాల మీదే. రాష్ట్రాల పరిధిలో లేకపోయినా, రాజ్యాంగంలో పొందుపర్చకపోయినాప్రజలు డిమాండ్ చేయడం మానరు. ప్రజల డిమాండ్ల ననుసరించి ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించలేదు. రాజ్యాంగాన్ని సవరించే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. తెలంగాణ ఏర్పడింది  కూడా రాజ్యాంగ సవరణ ద్వారానే. రాష్ట్రం పరిధిలో లేకపోతే,  కేంద్రం పరిధిలో ఉంటే, కేంద్రం మీద ‘మీ అందరితో కలసి వత్తిడి తీసుకువస్తా’నని హామీ ఇవ్వాలి. నమ్మకం కల్గించాలి.

[videopress 9qMDdjfV]

ముఖ్యమంత్రులు ఇలా ఎన్ని సార్లు కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణలు తీసుకురాలేదు?  మొన్నటికి మొన్న పోలవరం ప్రాజక్టు నిర్మాణానికి అడ్డొస్తాయని రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ నుంచి ఏడు మండలాలను కేంద్రం ఆంధ్రాకు బదలాయించింది. ఇలా ఎన్నోఆంశాలను రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు కేంద్రాన్ని నయాన భయాన వప్పించి, చట్టాలు చేయించి, రాజ్యాంగ సవరణ చేయించి నూతన చట్టాలు తీసుకువచ్చారు. 

ప్రజలు అలవికాని డిమాండ్లు చేస్తారు.అది సహజం. అపుడు నాయకుడు ఆ డిమాండ్లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. సాధ్యం కాకపోతే, సాధ్యం కావడం లేదని ఆచరణలో చూపిస్తారు. ఉదాహరణకు  ముస్లిం రిజర్వేషన్లను  నాటి ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారు. దాని వల్ల కొన్ని వేల మంది ముస్లిం విద్యార్థులు లబ్దిపొందారు.అయితే, ఇది తప్పని,  కోర్టు కొట్టి వేసింది. ఇలాగే ఎస్ సి క్యాటగరైజేషన్ విషయం రాష్ట్రం పరిధిలో లేదు. అన్ని రాజకీయ పార్టీలు నాడు ఈ విషయాన్ని సమర్థించాయి. క్యాటగరైజేషన్ జరపాల్సింది కేంద్రం  అని కోర్టు చెప్పింది. ఎస్ సి వర్గీకరణ ఆగిపోయింది. అపుడు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అది కేంద్రం దగ్గిర ఇరుక్కుపోయింది. 

ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం. ఇపుడున్న నియమాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు హోదా పొందే అర్హత లేదు.కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న రాష్ట్రాలకు మాత్రమే హోదా  వస్తుంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న రాష్ట్రానికి హోదా రాదు. అయితే, జగన్ ఆగలేదు కదా. హోదా సాధించి తెస్తానంటున్నారు. కేంద్రం మీద వత్తిడి తెస్తానంటున్నారు. మరి ఆంద్రాకు హోదా ఇవ్వాలంటే చట్టం సవరించాలి గా.

కాపు రిజర్వేషన్లకు పూర్తిగా -నో- చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి వడుపుగా తప్పించుకుని పోవలసి ఉండింది. రాజకీయానుభవం అంటే అదే. జగన్ ఈ మధ్య చాలా సార్లు తన అనుభవ రాహిత్యం బయటపెట్టుకుంటున్నారు. వ్యక్తుల మీద ఉన్న అక్కసును ఇలా బాహాటంగా బయటపెట్టరాదు. ముఖ్యంగా తన మాట ఒక కులాన్ని మొత్తం ప్రభావితం చేసేలా ఉంటే ఇంకా జాగ్రత్త అవసరం. జగన్ ఎందుకో ఈ ఔచిత్యం అపుడపుడు కోల్పోతున్నారు.

 

ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నికలపుడు ఆయన  చంద్రబాబును విమర్శించడం చాలా సార్లు అక్షేపణీయంగా తయారయింది. ఒక సారేమో కాల్చి చంపినా తపు లేదన్నారు,మరొక సారి ఉరిశిక్ష వేసినా తప్పలేదన్నారు. 

ఈ  వ్యాఖ్యల వల్ల అప్పటికిప్పుడు అక్కడిక్కడ చప్పట్లు వినిపించినా విశాల ప్రజానీకం మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తాయాని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.  నంద్యాల ఎన్నిల  ఫలితాలు వచ్చాక చాలా మంది వైసిపి నేతలు ఓటమికి  జగన్ వ్యాఖ్యలే కారణమని లోలోన చర్చించుకున్నారు.

[videopress U9kafQj5]

ఇలాంటి దే జగన్  పవన్ కల్యాణ్ మీద చెసి మూడు పెళ్లిళ్లు, పెళ్లాల వ్యాఖ్య. ఇది కూడా జగన్ కు వ్యతిరేకంగా నే పని చేసింది.జగన్ కుటుంబం మీదకు ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఇది జగన్ వంటి నాయకుడు అనాల్సిన మాట కాదు. జగన్ వ్యవహారంలో వ్యక్తి మీద కోపం పెడదారి పడుతూ ఉంది. ఇక్కడే నాయకుడిగా  ఆయన నిగ్రహం పాటించాలి.

ఆంధ్రప్రదేశ్ మంచి వాగ్ధాటి ఉన్న నాయకుడు జగన్. తనకు ఉన్న ఈ కోణాన్ని  జనాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయోగించాలి తప్ప అది జనాన్ని తరిమేసేలా చూసుకోకూాడదు. జగన్ కాపులు తన వైపు నుంచి వెళ్లి పోతారని అనుమానిస్తున్నారా? కాపులను పవన్ తనకు దూరం చేస్తాడని భావిస్తున్నారా? రాజకీయాలలో ఇలాంటి ఎదురు దెబ్బలు తగుల్తాయి. తెలివిగా వాటి నుంచి తప్పించుకుని, చాకచక్యంగా ప్రజలు తనవైపు తిప్పుకునేందుకు -మాటలకు పదును పెట్టాలి. స్పర్థ ఉండాలి తప్ప అది అడ్దదారి పట్ట కూడదు.  ప్రత్యర్థులను నిరాయుధుల్ని చేయాలి తప్ప ఆయుధాలందించరాదు. నంద్యాల నుంచి కిర్లంపూడి వరకు  అభ్యంతరకరమయిన పదజాలం వాడి జగన్ ప్రత్యర్థులకు ఆయుధాలందిస్తున్నారు. దీనితో ఆయన చేసిన భేషయిన  ప్రత్యేక హోదా క్యాంపెయిన్ కూడా దెబ్బతింటుందనిపిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగన్ సంకల్ప యాత్రలో గోనేడ తామరాడ రామచంద్రపురం కాపుల ప్లకార్డులు పట్టుకుని జగన్ అడ్డుకున్న రు నిరసన తెలిపారు. ఇలా  ప్రజాసంకల్ప యాత్రలో ఇదే మొదలు. 

ఇంతవరకు ముద్రగడ జగన్ మనిషనుకున్నారు. ఆ ఒక్క మాటతో ఆయన జగన్ కు దూరమయ్యారు.  విజయవంతంగా సాగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో ఇదొక అపశ్రుతిగా మిగిలిపోతుంది.