జగన్ ‘కాపు కోటా’ మాటని వక్రీకరించారు, ఇదేం రాజకీయం

కాపు కోటా మీద ఎలాంటి హామీ ఇవ్వలేదని, అది కేంద్రం పరిధిలో ఉన్న వ్యవహారమని వైసిపి నేత అధినేత జగన్ ప్రకటించగానే కాపు ఆగ్రహం పెల్లబుకగానే,వైసిపి నాలుక కరుచకుంది.  జగన్ ప్రకటన మీద వివరణ ఇచ్చింది. 

కాపుల రిజర్వేషన్లపై జగన్  వ్యాఖ్యలను వక్రీకరించారని
తుని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టిరాజా, తూ.గో. పార్టీ అధ్యక్షుడు కన్నబాబు, స్టేట్‌ యూత్‌ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నియోజకవర్గ సమన్వయ కర్తలు తోట సుబ్బారావు నాయుడు, పర్వతప్రసాద్, పెండెం దొరబాబు, మాజీ మంత్రి కె.మోహన్‌రావు  పేర్కొన్నారు.

ఒక వర్గం మీడియా, టీడీపీ, కొందరు నాయకులు రాజకీయస్వార్థంకోసం జగన్ ప్రజాసంకల్పయాత్రలో అన్న మాటలను  వక్రీకరించారని వారు పేర్కొన్నారంటూ వారు ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రకటన సారాంశం ఇది.

 

జగన్‌గారి వ్యాఖ్యల స్ఫూర్తిని దెబ్బతీసి ప్రచారంచేసి బురదజల్లుతున్నారు. 
తుని ఘటనకు స్పందనగా కాపుల రిజర్వేషన్లపై ఆరోజు మా పార్టీ అధ్యక్షులు చెప్పిన మాటలకు పార్టీ కట్టుబడి ఉంది.
మేం ఎప్పుడూ మాట మార్చలేదు. అదే వైఖరిమీద ఉన్నాం.

కాపులకు రిజర్వేషన్లపై మాపార్టీకి చిత్తశుద్ధి ఉంది. బీసీలకు ఎలాంటి నష్టంరాకుండా కాపుల రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడేమైనా సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం.

కాపుల ఆర్థికాభివద్ధికి రూ.10వేల కోట్లు ఇస్తాం.

4 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు– బీజేపీలు మేనిఫెస్టోలో పెట్టిన కాపు రిజర్వేషన్లను ఎందుకు చేయలేదని మీరేందుకు ప్రశ్నించడంలేదు. ప్రశ్నించడానికే పార్టీనన్న పవన్‌కళ్యాణ్‌ స్పందించకపోయినా అడగడంలేదు:
టీడీపీ–బీజేపీ ఇచ్చిన హామీలకు నాది బాధ్యతన్న ఈ మనిషిని కూడా అడగడంలేదు.

 
కాని, ప్రతిపక్షస్థానంలో ఉన్న వైయస్సార్‌సీపీని ప్రశ్నిస్తున్నారు. ఇదేమి రాజకీయమో ప్రజలు అర్థంచేసుకోవాలి.
ముద్రగడ పద్మనాభంగారు ఒక అజెండాను పెట్టుకొని, వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్టున్నారు:
ఆయన ఉనికిని కాపాడుకోవడానికి ముద్రగడగారు మాపార్టీపైనా, మా అధ్యక్షుడిపైనా అభాండాలు వేస్తున్నారు.

రిజర్వేషన్లు 50శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆతర్వాత తర్వాత కాపుల సహా ఆయారాష్ట్రాల్లో రిజర్వేషన్లకోసం పోరాడుతున్న వారి డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇవన్నీ ఉన్నాయని తెలిసినా తనకు ఓట్లేస్తే 6 నెలల్లోగా రిజర్వేషన్లు ఇచ్చేస్తానంటూ కాపులకు చంద్రబాబుగారు హామీచ్చారు:
హామీ ఇచ్చి పచ్చిమోసం చేశారు.

మంజునాథ కమిషన్‌ను ఏర్పాటుచేసిన చంద్రబాబుగారు, ఆ కమిషన్‌ ఛైర్మన్‌ సంతకంపెట్టకుండానే నివేదిక స్వీకరించి తూతూ మంత్రంగా బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు:
న్యాయపరమైన అడ్డంకులు లేకుండా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపరుచుకునేలా చూడాల్సిన చంద్రబాబుగారు ఎందుకు చేయలేకపోయారు?

బీజేపీ ప్రధాని అభ్యర్థిని పక్కనపెట్టుకుని, రిజర్వేషన్లపై హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారంచేసినా, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నా ఎందుకు ముందడుగు వేయలేకపోయారు?

ఆరోజే 9వ షెడ్యూల్‌లో పెట్టి ఉండిఉంటే.. ఈరోజు మన రాష్ట్రంలోకూడా తమిళనాడు, కర్ణాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా, ఏమాత్రం నష్టం వాటిల్లకుండా 50శాతానికి మించి కాపులకు రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా?:
ఈ నేపథ్యంలోనే చంద్రబాబుగారిలా గాలి మాటలు చెప్పలేనని, అలాంటి బూటకపు హామీలు ఇవ్వలేనని మాత్రమే జగ్గంపేట సభలో వైయస్‌ జగన్‌గారు స్పష్టంచేశారు.

కాపుల్లో ఆర్థికాభివద్ధికి ఐదేళ్లలో ఐదువేల కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటికి రూ.1300 కోట్లు మాత్రమే ఇస్తే, చంద్రబాబుగారు ఇస్తానన్న ఐదువేల కోట్లుకు రెట్టింపు స్థాయిలో అంటే రూ.10వేల కోట్లు ఇస్తామన్నాం. కాపులమీద ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.