గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జగన్ ముందస్తుకు రారని, ఇంకా ఎన్నికలకు ఏడాదిపైనే సమయం ఉందని అధికారపార్టీ నుంచి సంకేతాలు వస్తున్నా కూడా.. బాబు & కో లకు ఎక్కడో సందేహం! జగన్ ఉన్నఫలంగా ఎన్నికలు అంటే… అని! దీంతో.. బాబు రంగంలోకి దిగారు. జగన్ ని తన ట్రాప్ లోకి లాగే పనిలో ఉన్నారు!
2019 ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో చాలాకాలం బాబు మౌనంగానే ఉన్నారు. అనంతరం కోవిడ్ రూపంలో బాబు మౌనం కొనసాగింది. తర్వాత అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి! అయితే… గత కొన్ని రోజులుగా జనాల్లోకి వచ్చేశారు బాబు. దీంతో.. కావాలని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, సానుభూతిని సంపాదించే పనికి పూనుకున్నారనే కామెంట్లు మొదలైపోయాయి. ఊహించని రీతిగా జగన్ కూడా ఆ ట్రాప్ లో పడుతున్నారని అంటున్నారు. ఇందుకు అనపర్తి ఘటన ఒక ఉదాహరణ!
ఇకపై అనపర్తి లాంటి ఘటనలు ఇంకా చాలానే బాబు & కో ప్లాన్ చేసుకుని ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇది బాబు రాజకీయ స్ట్రాటజీలలో ఒక భాగం అనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. తాజాగా… గన్నవరంలో టీడీపీ ఆఫీసుకి నిప్పుపెట్టడం కూడా ఆ స్ట్రాటజీలో భాగమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో జగన్ తో పాటు ఆయన సహచర ఎమ్మెల్యేలు కూడా కాస్త సహనం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా అంశంపై స్పష్టత వచ్చేవరకూ స్పందించకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది! అలాకాని పక్షంలో ఇరగదీసి మీద పెట్టేయగలిగిన రాజకీయ సామర్ధ్యం బాబుకి ఉందని మరోసారి అనుభవంలోకి వచ్చే ప్రమాధం ఉంది. ఫలితంగా.. బాబు ట్రాప్ లో వైకాపా నేతలు పడిపోయే ప్రమాధం పుష్కలంగా ఉంది!!