జగన్, కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో టీ.ఆర్.ఎస్. అధికారంలో ఉందనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలే మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలను జూనియర్ ఎన్టీఆర్ తెగ టెన్షన్ పెడుతున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీని సపోర్ట్ చేస్తే తమకు నష్టమని ఈ పార్టీల అధినేతలు టెన్షన్ పడుతున్నారు.

బ్రహ్మాస్త్రం ఈవెంట్ కు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనని సమాచారం. కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో భయపడ్డారని అయితే జూనియర్ ఎన్టీఆర్ పై ప్రత్యక్షంగా విమర్శలు చేయడం ఇష్టం లేక ఈ విధంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ సమయంలో కూడా కేసీఆర్ సర్కార్ తారక్ ను టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

అయితే తారక్ తర్వాత సినిమా రిలీజయ్యే సమయానికి మునుగోడు ఉపఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడితే తారక్ పై కేసీఆర్ కు కోపం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే తారక్ మాత్రం రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. తారక్ ఎలా స్పందించినా ఏదో ఒక పార్టీ నేతలు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

అసలు స్పందించకుండా ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమమని తారక్ భావిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినా తన సినీ కెరీర్ పై ప్రభావం పడుతుందని తారక్ భావిస్తున్నారు. తారక్ తలచుకుంటే తెలంగాణలో టీడీపీ పుంజుకునేలా చేసే సత్తా కూడా ఉంది. అయితే తారక్ టార్గెట్ మాత్రం ఏపీనే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తర్వాత సినిమాలతో తారక్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.