లక్ష్మీపార్వతి లంపాటకం.! వదిలించుకుంటేనే వైసీపీకి లాభం.!

వున్నపళంగా లక్ష్మీపార్వతిని వైసీపీ నుంచి బయటకు పంపించేయడం బెటర్.! ఈ మాట వైసీపీ వర్గాల్లో బలంగా.. చాలా చాలా బలంగా వినిపిస్తోంది. స్వర్గీయ ఎన్టీయార్ భార్యగా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి లక్ష్మీపార్వతి నానా తంటాలూ పడుతున్న సంగతి తెలిసిందే.

నిజానికి, ఈ విషయంలో లక్ష్మీ పార్వతిని పూర్తిగా తప్పు పట్టేయలేం. ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా, ఆమె స్వర్గీయ ఎన్టీయార్‌కి సతీమణి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సరే, ఆయన్ని ఆమె బుట్టలో పడేసుకుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

కానీ, లక్ష్మీపార్వతి, ‘నేను ఆయనకి భార్యని కాదా.? అయితే, నన్ను ఆయన ఉంచుకున్నారని మీరు భావిస్తున్నారా.?’ అన్న అర్థం వచ్చేలా నందమూరి కుటుంబాన్ని లక్ష్మీపార్వతి ప్రశ్నించిన తీరు, వైసీపీ పట్ల ప్రజల్లో ఒకింత అసహనం పెరగడానికి కారణమయ్యింది. లక్ష్మీపార్వతి, వైసీపీలో వున్నారు. పైగా వైసీపీ సర్కారు ఇచ్చిన నామినేటెడ్ పదవిలోనూ వున్నారు.

మామూలుగా లక్ష్మీపార్వతి ఏం చేసినా, ఏం మాట్లాడినా.. అది వేరే లెక్క. కానీ, ఇప్పుడామె వైసీపీ ప్రభుత్వంలో కూడా భాగం. దాంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికీ, వైసీపీ పార్టీకీ ఇబ్బందులు తెస్తాయ్. తన ఆవేదనను లక్ష్మీపార్వతి వెల్లగక్కుకోవడంలో తప్పు లేదు. కానీ, మరీ ఇలానా.?

వైఎస్ జగన్ స్వయంగా, లక్ష్మిపార్వతిని టీడీపీ పైకి ఎగదోస్తున్నారు.. అన్న సంకేతాలు జనంలోకి వెళ్ళిపోతున్నాయి. లక్ష్మీపార్వతి విచక్షణ కోల్పోతుండడమే ఇందుకు కారణం. వున్నపళంగా వైఎస్ జగన్, ఆమెను కట్టడి చేయకపోతే, వైసీపీకి సివియర్ డ్యామేజ్ జరిగే ప్రమాదం వుంది రాజకీయంగా.