ఏ రాజకీయ నాయకుడు ఢిల్లీ వెళ్లినా దాని చుట్టూ రాజకీయ కోణాలు చుట్టుకోవడం లేదా మీడియా పని కట్టుకొని చుట్టడం, ఇతర పార్టీల నాయకులు అల్లడం చాలా సహజం. అలాగే ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన జగన్ పై కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన వైఎస్ జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. ఇలా వరుసlగా జగన్ ఢిల్లీకి వెళ్తుండటంతో ఇందులో రాష్ట్రాల ప్రయోజనాల కంటే మించిన వ్యవహారం నడుస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఎన్డీయే గూటికి చేరనున్న జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీయేలో చేరనున్నారని వైసీపీ అనుకూల మీడియాలోనూ, ఎన్నికల సర్వేలు నిర్వహించే సంస్థల సోషల్ మీడియా వేదికల్లోనూ కథనాలు వెలువడుతున్నాయి. వైసీపీకి రెండు కేంద్ర క్యాబినెట్ పదవులు, ఓ సహాయ మంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసిందన్నది ఆ వార్తల సారాంశం. తెలుగు మీడియాలోనూ ఇప్పుడిప్పుడే ఈ గాసిప్ చుట్టూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.కేంద్రంలోని ఎన్డీయే నుంచి పలు మిత్రపక్షాలు బయటకు వెళ్ళడంతో, కొత్త మిత్రుల కోసం బీజేపీ పెద్దలు గాలం వేస్తున్నారనీ, రాజ్యసభలో బలం కోసం వైసీపీని బీజేపీ పెద్దలు మచ్చిక చేసుకుంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం విదితమే. ఇప్పుడు జగన్ వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
వైసీపీకి అవసరమా!
ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ ముందు ఏ పార్టీ కూడా నిలువదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే గెలుస్తారన్నది కాదనలేని వాస్తవం. జగన్ కు ఏ పార్టీ మద్దతు లేకున్నా కూడా ఘన విజయం సాదించగలడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి బీజేపీతో కలవడం అవసరమా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ బీజేపీతో కలవకపోతే చంద్రబాబు కలుస్తాడాని, అది వైసీపీ చాలా నష్టమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో టీడీపీని పూర్తిగా దెబ్బతియ్యలన్న, బాబును సీబీఐ కేసుల్లో ఇరికించాలన్నా బీజేపీతో వైసీపీ అవసరం ఎంతైన ఉంది.