ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.! రాష్ట్రంలో విపక్షాలు బూతులు మాట్లాడితే, ఆ సంగతి ప్రజలు చూసుకుంటారు. మరి, వైసీపీలో మంత్రులే బూతులు మాట్లాడితే, కంట్రోల్ చెయ్యాల్సిందేముంది.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించారు. చెప్పు చూపించి వైసీపీ నేతల్ని హెచ్చరించారాయన. ‘యెదవలు అనీ, సన్నాసులు’ అనీ పవన్ కళ్యాణ్ తన సినిమాటిక్ స్టైల్ చూపించారు.సినిమాల్లో చెల్లుతాయివి, రాజకీయాల్లో చెల్లవ్.!
అయితే, ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా జనసేన అధినేత ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో గనుక జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు డజను సీట్ల కంటే ఎక్కువే వచ్చేలా వున్నాయి.సొంతంగా జనసేన పోటీ చేసినా పది పదిహేను సీట్లు ఈసారి ఆ పార్టీ గెలుచుకునేలానే వుంది వాతావరణం.
వాస్తవానికి, జనసేన గనుక రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నా.. ఆ పార్టీకి అది గెలుపు కిందనే భావించాల్సి వుంటుంది. ఇదీ జనసేన పరిస్థితి. సో, అలా గెలవడం కోసం జనసేన అధినేత నోరు పారేసుకుంటున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ, వైసీపీ మంత్రులకు ఏమయ్యింది.? మంత్రిగా పనిచేసిన సమయంలో, ఆ తర్వాత కూడా కొడాలి నాని బూతుల పంచాంగం ఆపట్లేదు.
తాజాగా అవనిగడ్డ బహిరంగ సభలో జనసేన అధినేత, బూతులు మాట్లాడే నాయకుల పట్ల అప్రమత్తంగా వుండాలని పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి విమర్శించారు. వైఎస్ జగన్ మాటలు కేవలం టీడీపీ, జనసేన పార్టీల్లోని నాయకులకే వర్తిస్తాయా.? వైసీపీకి కూడా వర్తిస్తాయా.? వైఎస్ జగన్ గనుక వైసీపీలోని బూతు నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతే, ఆ పార్టీకి జరిగే డ్యామేజ్ కనీ వినీ ఎరుగని రీతిలో వుంటుంది