ఇంతకీ కాపులు బిసీలా ? ఓసీలా ?

చంద్రబాబునాయుడు చేసిన ఓ చెత్త పనితో ఇపుడు రాష్ట్రంలో కాపులు ఏ సామాజికవర్గంకు చెందుతారో అర్ధం కాకుండా ఉంది. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నకు చంద్రబాబునాయుడు కూడా అసెంబ్లీ సమాధానం చెప్పలేకపోయారు. చేసిన కంపుకు లెంపలేసుకుని మాట్లాడకుండా కూర్చోవాల్సిందిపోయి ఇంకా బుకాయించటంతో జగన్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబుపై రెచ్చిపోయారు.

కాపులను బిసిల్లో చేరుస్తామని 2014లో హామీ ఇచ్చారు చంద్రబాబు. నిజానికి రిజర్వేషన్ల అంశం రాష్ట్రాల పరిధిలో లేదన్న విషయం తెలిసీ ఓట్ల కోసం తప్పుడు హామీలిచ్చారు. హామీనిచ్చిన చంద్రబాబు అమలులో మాత్రం బోల్తాపడ్డారు. మంత్రివర్గంలోను అసెంబ్లీలోను కాపులు బిసిలో చేరిపోయినట్లుగా అభినందనలు అందుకున్నారు. దాంతో తాము బిసిలో చేరిపోయినట్లుగా కాపులంతా సంబరాలు చేసుకున్నారు.

చివరకు రాష్ట్రం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరగకొట్టింది. దాంతో కాపులను బిసిల్లో చేర్చలేదని అందరికీ అర్ధమైపోయింది. అయితే కొంత కాలం తర్వాత ఓబిస్సీలో పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వెంటనే కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5 శాతాన్ని తాను కాపులకు వర్తింపచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకున్నారు.

అయితే కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లో కాపులకు 5 శాతం కేటాయించటం చెల్లలేదు. దాంతో రెండోసారి కూడా చంద్రబాబు ఫెయిలయ్యారు. కాపులేమో ఇపుడు తాము బిసిలమనే అంటున్నా అందుకు తగ్గట్లుగా వాళ్ళ దగ్గర బిసి సర్టిపికేట్లు మాత్రం లేవు. దాంతో తాము బిసిలమన్న కాపుల వాదన చెల్లటం లేదు. ఇదే విషయం అసెంబ్లీని మంగళవారం ఓ కుదుపు కుదిపేసింది లేండి. మొత్తానికి చంద్రబాబు చేసిన నిర్వాకంతో కాపులు ఓసిలా ? లేకపోతే బిసిలా ? అన్నదే తేలటం లేదు.