నారా దేవాన్ష్…పరిచయటం అవసరం లేని పేరు. నారా దేవాన్ష్ అంటే చంద్రబాబునాయుడు మనవడన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో చెప్పేస్తారు. అలాంటి దేవాన్ష్ కు ట్విట్టర్ ఖాతా ఉంది. నిజానికి పిల్లలు సోషల్ నెట్ వర్క్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో తరచూ కనబడుతునే ఉంటారు. కానీ వారెవరికీ సొంతంగా ఖాతాలుండవు.
ఎందుకంటే, ట్విట్టర్ లో ఖాతా తెరవాలంటే కనీసం 13 సంవత్సరాల వయస్సుండాలి. సరే వయస్సును తప్పుగా చెప్పి ఖాతాలు తెరవటం లేదా అంటే అది వేరే సంగతి. ఇక్కడ మిగిలిన వాళ్ళకు దేవాన్ష్ కు చాలా తేడా ఉంది. దేవాన్స్ ను పుట్టిన దగ్గర నుండి నారా కుటుంబం మొత్తం ఓ సెలబ్రిటీని చేయాలన్న కోరికతో ఉన్నది. అందుకే సందర్భానుసారం మనవడిని చంద్రబాబు బాగానే ఫోకస్ పెట్టారు.
తండ్రి, కొడుకులిద్దరూ దేవాన్ష్ ను ఫోకస్ చేయటంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. కానీ అదే సమయంలో దేవాన్ష్ పై అందరి కళ్ళు ఉన్న విషయాన్ని వాళ్ళు మరచిపోయారు. ఇపుడు లోకేష్ ఆధారలతో సహా దొరికిపోయాడు. తన ఖాతాకు అనేక సందర్భాల్లో దేవాన్ష్ ఖాతాను ట్యాగ్ చేస్తుండటంతో దేవాన్ష్ కు కూడా ప్రత్యేకంగా ఖాతా ఉన్న విషయం అర్ధమైపోయింది. మరి చిన్న పిల్లలకు ట్విట్టర్లో ఖాతా ఉండకూడదన్న నిబంధన ఐటి శాఖ మంత్రి లోకేష్ తెలీకుండా ఉంటుందా ?