Lakshmi Pranathi: సోషల్ మీడియా జనాలకు సెలబ్రిటీలను దగ్గర చేసింది. వారికీ సంబంధించిన ఏ విషయం అయినా నేరుగా వారికీ తెలిసేలా అయింది. దీంతో అభిమాన హీరో హీరోయిన్ లను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటూ ఫాన్స్ వాళ్ల లవ్ ని తెలియజేస్తున్నారు.అయితే హీరోలే కాకుండా హీరో భార్యలు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, అల్లుఅర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఇప్పటికే ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో వారి ఫాలోయర్స్ తో రికార్డ్స్ సృష్టిస్తున్నారు.
అయితే నందమూరి ఫ్యామిలీ సోషల్ మీడియా ఫాలోయింగ్ లో వెనకబడిందనే చెప్పాలి. తారక్ తన ఫ్యామిలీ పిక్స్ కానీ విషయాలు కానీ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా షేర్ చేసుకోరు. ఈ సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీ లు తమ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫాన్స్ ని ఖుష్ చేస్తున్నారు. ఇపుడు తాజాగా ఈ బాటలో తారక్ వైఫ్ లక్ష్మి ప్రణతి కూడా జాయిన్ అయింది. ట్విట్టర్ లోకి అడుగుబెట్టి ఫాన్స్ కి షాక్ ఇచ్చింది.
Happy to join Twitter with You all! Posting my First tweet with my lovable husband @tarak9999 #NTR. pic.twitter.com/2vQNuuLVDJ
— Lakshmi Pranathi (@LakshmiNTR_) January 27, 2022
మొదటి పోస్ట్ తన భర్తతో దిగిన క్యూట్ పిక్ ని షేర్ చేసి మీ అందరితో కలిసి ట్విట్టర్ లో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉందని నా లవ్లీ భర్తతో మొదటి పోస్ట్ చేస్తున్నానని రాసారు అలాగే ఎన్టీఆర్ ను టాగ్ చేసారు.మొదటి పోస్ట్ షేర్ చేయగానే 24గంటల్లో 3వేల మంది ఫాలోయర్స్ ను సంపాదించింది. ఇలా లక్ష్మి ప్రణతికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు ఫాన్స్.రానున్న రోజుల్లో వారి ఫ్యామిలీ అప్ డేట్స్ తో ప్రణతి రచ్చ చేయబోతోంది .