కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆగిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూశారు. ఇక విద్యార్థుల అవస్థలు అయితే అన్ని ఇన్ని కావు. ఆన్ లైన్ చదువులతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేక ఒకవేళ ఫోన్లు ఉన్నా ఇంటర్ నెట్ సౌకర్యం లేక చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికే జగన్ ఎన్నో పథకాలను అమలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు సీఎం జగన్. సొంత ఊళ్లల్లోనే వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాలన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మ ఒడి కింద ల్యాప్ టాప్‌ల పంపిణీపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.
ఇంటర్ నెట్ సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మ ఒడి కింద ల్యాప్ టాప్ ల పంపిణీపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ఉండాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఏడాది అమ్మ ఒడి చెల్లింపుల నాటికి ల్యాప్ టాప్ లను ఇచ్చేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ల్యాప్ టాప్ లు చెడిపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వారం రోజుల్లో తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు ఉండాలన్నారు సీఎం జగన్. మారు మూల ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్యలను అధిగమించాలని ఆయన తెలిపారు.