సీఎం సొంత జిల్లాలో ఒక్కో ఓటు రూ. 8000 !

Panchayat elections turned into a power struggle

ఏపీలో పంచాయతీ ఎన్నికల హిట్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది. దీనితో బరిలో నిలిచిన అభ్యర్థులు విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 19,491 సర్పంచ్ పదవులకు గాను 523 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా తప్పించి మిగిలిన 12 జిల్లాల్లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో 523 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

open secret how consensus can be reached in panchayat elections
open secret how consensus can be reached in panchayat elections

ఇదిలా ఉంటే .. ఈ పంచాయతీ ఎన్నికలకి కొన్ని ప్రాంతాల్లో ఓటుకి రూ. 2 వేల నుండి రూ. 3 వేల వరకు ఇస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లా కమలాపురం మండలంలో అదో చిన్న పంచాయతీ. సుమారు 240 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సర్పంచి పదవి ఈసారి జనరల్‌కు కేటాయించారు. రెండో దశలో ఎన్నిక జరగాల్సి ఉంది. వైకాపా మద్దతుదారు ఒకరు తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. రూ.20 లక్షలు ఇస్తానని ముందుకొచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా, పంచాయతీలోని ఒక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. దీనికి సిద్ధపడిన గ్రామపెద్దలు మిగతా ఆశావహులను బరి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.