అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం టీడీపీ ఏడాదిన్నరగా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. అందులో ప్రభుత్వం స్వయంకృపారాధం కొంత ఉంది. హైకోర్టు తో చీవాట్లు తినడం అన్నది ఏ ప్రభుత్వానికైనా భంగపాటే. ఆ రకంగా ఏడాది కాలంగా ఎన్ని మొట్టికాయలు వేయించుకోవాలో అన్నీ వేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం సహా ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక అంశాలను ఆసరాగా చేసుకుని..చట్టంలో లొసుగులు వాడుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు –జగన్ మోహన్ రెడ్డిని మూడు చెరువుల నీళ్లు త్రాగించారు.
అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం అయినా..పాలన చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నట్లే ఏడాది పాటు సాగింది. క్రింద స్థాయి అధికారులు చేసిన తప్పులకు జగన్ బలవ్వాల్సి వచ్చిన మాట వాస్తవం. వైసీపీ పై వ్యతిరేకత తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కొంత వరకూ అయితే సక్సెస్ అయ్యాడనే అనాలి. తాను చేయాలనుకున్న అరోపణని గట్టిగానే చేసి ఓ విమర్శ అయితే తీసుకురాగలిగారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అండో కో వైసీపీని మరింత డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఏడాదిగా రాష్ర్టంలో ఉన్న ఐఏఎస్ లు అందర్నీ వాడుకోవడంలో ప్రభుత్వం విఫమలైందని టీడీపీ కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చింది.
ఇప్పటికే ఐదుగురు ఐఏఎస్ లు ఢీల్లికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారుట. వారితో పాటు అదనంగా మరో ఇద్దరు కూడా జత కలవనున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ ఐఏఎస్ లు గనుక ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే అంతకన్నా అపకీర్తి మరొకటి ఉండదు. ఓ వైపు రాష్ర్టంలో ప్రభుత్వం పాలను గురించి గొప్పగా చెప్పుకోవడం.. కేంద్రం కూడా సంక్షేమ పథకాల అమల తీరును..జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసించడం గురించి తెలిసిందే.