వైసీపీ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విథేయులు చాలా మందే ఉన్నారు. అందులో జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒకరు. ఇటీవలి కాలంలో సుధీర్ రెడ్డి కూడా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణమారాజులా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకిగా మారినట్లు ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి పోటీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామసు బ్బారెడ్డని వైసీపీలోకి తీసుకుని పెద్ద పీట వేస్తున్నారని వస్తోన్న కథనాల నేపథ్యంలో రామసుబ్బారెడ్డి ఎంట్రీని సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సుధీర్ రెడ్డి ఆయన అనుచర వర్గం జగన్ మోహన్ రెడ్డి పై గుసాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి పై..వైసీపీ పార్టీపై తను విధేయథను చాటుకున్నారు. తనపై వచ్చినవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని…అన్నీ కల్పిత కథనాలేనని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేకపోతే తనకి రాజకీయ జీవితమే ఉండేది కాదని భావోద్వేగానికి గురయ్యారు. తొలి నుంచి జగన్ మోహన్ రెడ్డి అభిమానిగానే ఉన్నానని, ఎప్పటికీ జగన్ మోహన్ రెడ్డికి విధేయుడిగానే ఉంటానని ఉద్ఘాటించారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేయడానికి సిద్దంగా ఉన్నానన్నారు. వైఎస్ కుటుంబాన్ని ఎదురుంచిన వాళ్లు బాగుపడినట్లు ఇప్పటివరకూ రాజకీయ చరిత్రలో లేదన్నారు.
రఘురామకృష్ణమరాజు, ఆది నారాయణ రెడ్డి లాంటి వారు ఎదురించి ఏమీ సాధించారని ఎద్దేవా చేసారు. అలాగే అసలు తననని రఘురాకృష్ణo రాజుతో ఎందుకు పోల్చుతున్నారో? అర్ధం కాలేదున్నారు. అలాగే రఘురామకృష్ణమరాజు వైసీపీ పార్టీ విధానాలపై వ్యతిరేకంగా మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. జమ్మల మడుగులో తన గెలుపుకు ఎంపీ వినాష్ రెడ్డి కారణమని, అటువంటి కుటుంబాన్ని ఎందుకు తిడతానని ఖండిచారు. తుది శ్వాస వరకూ జగన్ వెంటే ఉంటానని, వైసీపీ జెండా వదిలేది లేదని..ఆ పార్టీకి ఎప్పుడూ ఓ కార్యకర్తగానే ఉంటానని పేర్కొన్నారు.