చంద్రబాబుకు ప్రస్తుతం చాలా బ్యాడ్ టైం నడుస్తుందనే కామెంట్లు బలంగా వినిపిస్తోన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన అనంతరమే ఆ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని, అమరావతిని ఎత్తుకున్న అనంతరం అది పీక్స్ కి చేరిందని… ప్రస్తుతం దానికి సంవ్బంధించిన ఫలితాలు అనుభవిస్తున్నారని అంటున్నారు. ఈక్రమంలో తాజాగా మరోసారి బాబు బ్యాడ్ టైం చర్చకు వచ్చింది.
అవును… చంద్రబాబు వల్ల ఎంఓమంది అమాయక ప్రజలు, టీడీపీ కార్యకర్తలు మృతిచెందారని వైసీపీ ఆరోపిస్తోంది. పైగా అలాంటి ప్రామాధాలు జరిగి ప్రజలు మృతి చెందినా కూడా… బాబుకు చీమకుట్టినట్లయినా ఉండదని.. ఆయన బ్రెయిన్ దెబ్బతిన్నదని.. మానవత్వం మచ్చుకైనా లేని వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఇందులో భాగంగా… చంద్రబాబు వల్ల జరిగిన ప్రాణ నష్టాలు, ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై ట్విట్టర్ లో స్పందించింది వైసీపీ.
ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన “ఇదేం ఖర్మ” సభలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జనం ఎక్కువగా వచ్చినట్లు చూపించడం కోసం ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్ల, రోడ్లపై మీటింగులు నిర్వహించడం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా బాబు తగ్గలేదు.. తగ్గేదేలేదంటూ ముందుకు పోతున్నారు.
పైగా… కందుకూరు సభలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం చంద్రబాబుకి తెలిసింది. అనంతరం బాబు… “నేను ఆస్పత్రికి వెళ్లి చూసి వస్తాను.. నేను తిరిగి వచ్చే సరికి తమ్ముళ్లూ మీరు ఇక్కడే వెయిట్ చేయాలి.. చేస్తారా” అంటూ స్పందించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి.
మరీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. 8మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు, బందువులూ, స్నేహితులూ శోకసముద్రంలో మునిగిపోయి ఉంటే… మీటింగ్ కంటిన్యూ చేస్తాను ఇక్కడే ఉండండి అని అనడమేమిటి అంటూ జనం ఫైరయ్యారు.
ఇదే సమయంలో… గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా… “సార్ మీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు” అని టీడీపీ నేతలు చంద్రబాబుకు చెబితే.. ఏమాత్రం పట్టించుకోకుండా గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయారు!! దీంతో మరోసారి బాబు వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇక గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘోరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. మీ వల్లే కదా 29 మంది చనిపోయారంటే.. “పూరి జగన్నాథ రధయాత్రలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోలేదా?” అని వితండవాదం చేశారు చంద్రబాబు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. కనీసం చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్లి పరామర్శ కూడా చేయలేదు! ఇది బాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్!
ఇప్పుడు తాజాగా జమ్మలమడుగులో చంద్రబాబు సభ జరుగుతుండగానే.. వెనకాల మంటలు చెలరేగాయి. టీడీపీ కార్యకర్తలు శృతిమించి కాల్చిన బాణసంచావల్ల ఒక టిఫిన్ బండి కాలిపోయింది! ఈ సమయంలో అసలు ఆ బండి ఎవరిది, వారికి నష్టపరిహారం ఇద్దాం అని చెప్పాల్సిన చంద్రబాబు.. కారకర్తలకు ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు చెప్పాల్సిన చంద్రబాబు… “తక్కువ ధరకే నాణ్యమైన మందు ఇస్తాం” అంటూ ఉపన్యసించి వెళ్లిపోయారు.
దీంతో… చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇదే సమయంఓ వైసీపీ తన అధికారిక ట్విట్టర్ లో చంద్రబాబుపైనా, ఆయన లెగ్గు మహిమపైనా ట్వీట్ చేశింది. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుచేసే ప్రయత్నం చేసింది.
అవును… “మీ సభలకు జనాలు రావడం లేదు కాబట్టి మీరే ఇలాంటి ప్రమాదాలు డిజైన్ చేసి ఉంటారేమో… లేదా, మీ దరిద్రపు పాదం దెబ్బకు అప్పట్లో గోదావరి పుష్కరాల సమయంలో ఒక ప్రమాదం.. మొన్న గుంటూరులో చీరల పంపిణీలో ఇంకోటి.. ఇంకా కందుకూరులో మీ పాద మహిమకు నలిగిపోయిన ప్రాణాలు మాదిరి ఇది నిజంగానే ఇంకో ప్రమాదమా? ఏమో… అంతా మీ లెగ్గు మహిమ!” అని ట్వీట్ చేసింది!