ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికలు జరిగినా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సైతం పాజిటివ్ గా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో సంతోషంగా ఉంది. అయితే తాజాగా వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగగా ఈ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం.
ఈ విధంగా జరగడంతో వైసీపీకి ఘోర అవమానం జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు పోటీ చేయలేదని తెలుస్తోంది. ఏపీ హోం మంత్రి వనిత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో వైసీపీ ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. వనితకు పార్టీపై పట్టు లేదని అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అధికార పార్టీలో సైతం అసంతృప్త నేతలు, కార్యకర్తలు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీపై ప్రజలలో వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీది బలం కాదని వాపు అని కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల వల్ల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారని చెబుతున్నారని సమాచారం అందుతోంది.
కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలు టీడీపీలో జోష్ రావడానికి కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ వైసీపీకి షాకిచ్చే విధంగా ఫలితాలను అందుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాల వల్ల హోంశాఖ మంత్రి వనితకు రాబోయే రోజుల్లో వైసీపీ తరపున పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.