4000 కిలోమీటర్ల పాదయాత్ర.. టీడీపీకి లోకేశ్ నుంచి భారీ షాక్ గ్యారంటీ?

రాష్ట్రంలోని ప్రజలకు దగ్గర కావాలంటే పాదయాత్ర చేయాలా? అనే ప్రశ్నకు ఒకప్పుడు అవుననే సమాధానం వినిపించినా ఇప్పుడు కాదనే సమాధానం వినిపిస్తోంది. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసినా ఫలితం శూన్యమనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయానికి వైఎస్సార్టీపీ పార్టీ తెలంగాణలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఎక్కువమంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

400 రోజుల పాటు రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ భావిస్తున్నారు. అయితే లోకేశ్ వ్యక్తిత్వం తెలిసిన వాళ్లు మాత్రం ఆయనకు పాదయాత్ర సూట్ కాదనే అభిప్రాయాన్ని వెల్లడిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు అయినా ఈ విషయంలో లోకేశ్ కు సూచనలు చేసి ఉంటే బాగుండేది. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో లోకేశ్ పాదయాత్ర వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు.

మంగళగిరి నియోజకవర్గంలో కూడా నాలుగురోజుల పాటు పాదయాత్ర చేస్తానని లోకేశ్ పేర్కొన్నారు. అయితే లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లోకేశ్ నుంచి భారీ షాక్ గ్యారంటీ అని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో లోకేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి. లోకేశ్ స్పీచ్ ల విషయంలో ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

లోకేశ్ సభలకు ప్రజల నుంచి రెస్పాన్స్ లేకపోతే మాత్రం టీడీపీ పరువు పోతుందని చెప్పవచ్చు. లోకేశ్ పాదయాత్ర ఖర్చులను భరించాల్సిన బాధ్యత టీడీపీ నేతలపైనే ఉందని మరి కొందరు చెబుతున్నారు. రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో లోకేశ్ పాదయాత్ర భారం నేతలపై ఏ రేంజ్ లో ఉండనుందో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.