వైసీపీకి ఎమ్మెల్యేల నుంచి షాక్ తగలనుందా.. జగన్ ఏం చేయబోతున్నారా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చే దిశగా పలువురు ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. వైసీపీలో తనకు పదవులు దక్కకపోవడం వల్లే కోటంరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. టీడీపీ నుంచి హామీ లభించడం వల్లే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో తాము గెలిచే అవకాశం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు బలంగా నమ్ముతున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేలు సర్వేల ఆధారంగా వైసీపీకి దూరమవుతున్నారని తెలుస్తోంది. జరుగుతున్న తప్పుల విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత జగన్ సర్కార్ పై అయితే ఉంది.

జగన్ సర్కార్ నిబంధనల పేరుతో పలువురికి పథకాలను అమలు చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది. వైసీపీ తరపున ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడంతో అందరికీ పదవులు ఇచ్చి న్యాయం చేయడం జగన్ కు సైతం సాధ్యం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.