విచిత్రంగా ఉంది తెలుగుదేశంపార్టీ నేతలు, చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచే మీడియా వాదన వింటుంటే. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు అప్పు ఇవ్వమని చంద్రబాబు ప్రపంచ బ్యాంకును అడిగారు. అందుకు ప్రపంచ బ్యాంకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది.
అయితే అదే సమయంలో అమరావతి నిర్మాణం వల్ల వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఏ విధంగా ధ్వసమవుతున్నాయో ఫిర్యాదులు కూడా వెళ్ళాయి బ్యాంకుకు. పర్వావరణ పరిరక్షణపై పోరాడుతున్న స్వచ్చంధ సంస్ధలు, వామపక్షాలు కూడా ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు మీద ఫిర్యాదు చేశాయి.
అన్నింటినీ భేరీజు వేసుకున్న బ్యాంకు ప్రతినిధులు క్షేత్రస్ధాయి అధ్యయనానికి కమిటిని వేస్తున్నట్లు చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులకు బ్యాంకు ఫండింగ్ ఇవ్వదు. అయితే చంద్రబాబు తప్పుడు రిపోర్టు వల్ల బ్యాంకు అప్పు ఇవ్వటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఇదంతా జరుగుతుండగానే ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. అదే సమయంలో పంటపొలాలను తమ దగ్గర నుండి చంద్రబాబు లాక్కున్న విషయం ప్రపంచబ్యాంకు దృష్టికి వెళ్ళింది. దాంతో విషయాలను గ్రహించిన తర్వాత అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వకూడదని నిర్ణయించి సమాచారం ఇచ్చింది. వాస్తవాలు ఇలావుంటే జగన్ ప్రభుత్వం వల్లే వస్తున్న రుణం కూడా ఆగిపోయిందంటూ టిడిపి, చంద్రబాబు మీడియా రాద్దాంతం చేస్తుండటమే విచిత్రంగా ఉంది.
