హరిరామ జోగయ్యను వాయించి వదిలిన హైకోర్టు!

పవన్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో రూపంలో తన సహకారం అందించాలని తపించే చేగొండి హరిరామజోగయ్య… అందులో భాగంగానో ఏమో… తాజాగా 2024 ఎన్నికల నాటికి జగన్ పై ఉన్న కేసులను విచారించి తీర్పు ఇవ్వాలని కోర్టుకెక్కారు! దీంతో… కోర్టు ఆగ్రహాన్ని రుచి చూశారు!

మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య జ‌గ‌న్ కేసుల‌పై న్యాయ‌పోరాటం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును వీలైనంత తొందరగా విచారించాలంటూ తెలంగాణ హైకోర్టులో “పిల్” దాఖలు చేశారు! ఈ సందర్భంగా హరిరామజోగయ్య పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది! మీరు దాఖలు చేసిన పిల్ లో “పబ్లిక్‌ ఇంట్రస్ట్‌” ఏముందని ప్రశ్నించింది.

అనంతరం… “ఒక బాధ్యత గల మాజీ పార్లమెంట్‌ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్‌ లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉందా? వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృథా చేయవద్దు” అని ఘాటుగా సూచించింది.

ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తూ… “సీఎం జగన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో రాష్ట్రపతికి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటున్నారు! ఇది ఏం పద్ధతి? ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి” అని హెచ్చరించినంత పనిచేసింది!