తన అభిమాని , రాష్ట్ర సిఎం వై ఎస్ జగన్ మాకే జై కొట్టిన నందమూరి బాలకృష్ణ..!

ఎమ్మెల్యే హామీతో శాంతించిన బాలయ్య

కరోనా దేశంలో ప్రారంభం అయినప్పుడు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. మాస్క్ లు అవసరం లేదని ఒక నాయకుడు అంటే, ప్యారాసీటమాల్ వేసుకుంటే సరిపోతుందని మరో నాయకుడు అనేవారు. ఇలా తమవుకున్న మిడిమిది జ్ఞానంతో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. అయితే అదే సమయంలో కరోనాకు భయపడకుండా కాస్త జాగ్రత్త వహిస్తూ రోగ నిరోధక శక్తి ఉంటే సరిపోతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే అప్పుడు ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పు పట్టారు. కరోనాను అంత తేలిగ్గా తీసుకోకూడదని, జగన్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. అయితే తాజాగా టీడీపీ నాయకుడు, హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కరోనాపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

ఎవరికైనా కరోనా వచ్చింది, పాజిటివ్ అని తేలిందని తెలియగానే అంతా కంగారు పడిపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం మంచిది కాదని, రకరకాల ట్రీట్ మెంట్స్ వచ్చాయని, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చని బాలకృష్ణ తెలిపారు. ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే టీడీపీ నాయకుడు బాలకృష్ణ అదే వ్యాఖ్యలు చేశారని, అప్పుడు జగన్ ను తప్పు పట్టిన టీడీపీ ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నారు. టీడీపీ నాయకులే కరోనాపై ప్రజల్లో అనవసర భయాన్ని సృష్టించారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చినబాబులు ఇంట్లోనే ఉంటుంటే… బాలయ్య మాత్రం బయటకు వస్తూ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ని రెగ్యులర్ గా సందర్శిస్తూ.. వైద్యులకు, వైద్య సిబ్బందికి మరింత ధైర్యం చేబుతూనే ప్రజలకు భరోసా ఇస్తూ ఇలాంటి ధైర్యమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే కరోనా సమయంలో బాలకృష్ణ చాలాసేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. హిందూపూర్ కూడా లక్షల విలువ చేసే వైద్య సామాగ్రిని అందజేశారు.