భారత్ రాష్ట్ర సమితి పార్టీ, భారతదేశమంతా విస్తరించాలనుకుంటోంది. ముందైతే, సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చెయ్యాలి కదా.? ఏం, ఎందుకు చెయ్యదు.? జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్‌ని బీఆర్ఎస్ ఏపీ బాధ్యుడిగా నియమించారు కేసీయార్.. సో, ఆ పార్టీకి ఏపీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు బాగానే దొరకొచ్చు.
ప్రస్తుతం కేసీయార్ క్యాబినెట్‌లో వున్న ఓ మంత్రి కృష్ణా లేదా గుంటూరు (ఉమ్మడి జిల్లాలు) జిల్లాల్లో ఏదో ఒక చోట పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమలోనూ ఓ మంత్రి పోటీ చేయనున్నారట. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా ఓ మంత్రి పోటీ చేసేలా కేసీయార్ వ్యూహ రచన చేస్తున్నారనే గాసిప్ ఒకటి బయటకు వచ్చింది.
తెలంగాణ మంత్రి హరీష్ రావుని, ఉత్తరాంధ్రకు కేసీయార్ పంపించబోతున్నారన్నది ఓ గుసగుస. ఇందులో నిజమెంత.? అన్నది ముందు ముందు తేలుతుంది. మరీ, ముగ్గురు మంత్రులు కాదుగానీ.. ఒక్కరైతే ఖచ్చితంగా ఏపీ నుంచి పోటీ చేయొచ్చని గట్టి ప్రచారం జరుగుతోంది. ఆ ఒక్కరూ హరీష్ రావే అవుతారనీ, ఆయన్ని రాజకీయంగా బలి చేయడానికే కేసీయార్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనా లేకపోలేదు.
ఈ క్రమంలోనే హరీష్ రావు కూడా అత్యుత్సాహం చూపుతున్నారట. కాదు కాదు, గులాబీ పార్టీ కొంప ముంచే పని చేస్తున్నారట.. అన్నది ఓ అభిప్రాయమ్. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! తెలంగాణ నేతలు ఏపీలో పోటీ చేస్తే, ఏపీ నేతలు తెలంగాణలో పోటీ చేయకుండా వుంటారా.?