తెలంగాణ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన హరీష్ రావు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాంచి దూకుడు మీదున్నారు. మాకు తిరుగే లేదు అన్నట్లు స్పీడ్ పెంచారు. కానీ తాజాగా మంత్రి హరీష్ రావు వారి స్పీడ్ కు బ్రేకులేసేలా పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఎపి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై సూటిగా విమర్శలు చేశారు హరీష్ రావు. సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ను టార్గెట్ చేసి మీడియాతో మాట్లాడారు.  ఇంతకూ ఆయనేమన్నారో కింద చదవండి.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. ప్రత్యేక హోదా అంటే ఏంటో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణా కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణలో సమస్యలు సృష్టిస్తారా.. ? ప్రత్యేక హోదా పేరుతో ఏపీకి పారిశ్రామిక రంగంలో పన్ను రాయితీలను ఇస్తారు. ఇలా రాయితీలు ఇవ్వడం ‌వల్ల తెలంగాణ లోని పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్లిపోతాయి కదా? ఇలా తెలంగాణ కు అన్యాయం జరగడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుమతిస్తారా..? దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏపీకి పన్ను రాయితీలు ఇస్తే తెలంగాణ కు కూడా ఇవ్వాలి. ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు‌‌ స్పష్టత ఇవ్వాలి. తెలంగాకు కూడా ఇస్తారా…లేదా ఏపీకి మాత్రమే ఇచ్చి తెలంగాణ కు నష్టం చేస్తారా? అన్నది అధిష్టానం వద్ద తేల్చుకోవాలి. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణ లో‌ఒక్క ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వలేదు. హైకోర్టు విభజిస్తామని విభజన చట్టంలో పేర్కొని, కాంగ్రెస్, బీజేపీలు విభజన చేయకుండా తెలంగాణ కు నష్టం చేస్తున్నాయి.