ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వం ఎదుట ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 60 నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం జగవ్.. ఆర్ధికాబివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూనే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో బేషరతుగా ప్రకటించినట్లు జగన్ గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సకాలంలో నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PFC, REC రుణాలపై ప్రతి ఏడాకి 10 నుంచి 11 శాతం వడ్డీల రూపలో చెల్లించాల్సి వస్తోందని జగన్ అన్నారు. తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉంటున్న దేశాల్లో ఈ వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతానికి మించి లేవన్నారు.
అప్పులపై వడ్డీలు, విద్యుత్ ఖర్చులు రాష్ట్రానికి భారంగా పరిణమించాయన్నారు జగన్. అలాగే ఉత్పత్తిలో మంచి పనితీరు కనబరుస్తున్న పరిశ్రమలకు రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని.. కేంద్రం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ముందుకెళ్తున్నట్లు ప్రధాని మోదీకి సీఎం జగన్ వివమరించారు.