కారు ప్రమాదంపై స్పందించిన జీవీఎల్

ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీ కొని ఒక మహిళ మృతి చెందగా మరొక మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శుక్రవారం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, కొలనుకొండ వద్ద చోటు చేసుకుంది.

ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి జీవీఎల్ మరొక కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు. కారు నడుపుతున్న డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితురాలికి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించకుండా, గాయపడిన మహిళను పరామర్శించకుండా వెళ్లిపోయారంటూ జీవీఎల్ పై తీవ్ర విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఈ నేపథ్యంలో కొలనుకొండ వద్ద జరిగిన ప్రమాదంపై జీవీఎల్ స్పందించారు. తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ వెల్లడించారు. పార్టీ మీటింగ్ ముగిశాక పార్టీ ఆఫీస్ కార్ లో నేను రిటర్న్ అయ్యాను. ప్రమాదం జరిగిన సమయంలో నేను వెనుక సీట్లో నిద్రపోతూ ఉన్నాను. ప్రమాదం జరిగిన 20 నిమిషాలకి నాకోసం మరొక కారు వచ్చింది. కానీ 45 నిమిషాలపాటు అక్కడే ఉన్నాను. పోలీసులు వచ్చాక, గాయాలపాలైన మహిళని హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి అంబులెన్సు వచ్చే వరకు, మరణించిన మహిళని తీసుకెళ్లడానికి మరొక వాహనం వచ్చే వరకు నేను అక్కడే ఉన్నాను. నాపై వస్తున్నవి కట్టు కథలే అంటూ ట్వీట్ పెట్టారు.

I was returning from a party meeting in our party Office car. Another car came within 20 minutes of the incident to take me. However,I waited until ambulance arrived to take injured lady to hospital & another vehicle arrived to take deceased lady’s body. Anything else is fiction. https://t.co/JxYeoNgSa9

— GVL Narasimha Rao (@GVLNRAO) August 24, 2018

I was sleeping on a back seat when the incident happened. I was at the spot for 45 minutes until police came, injured woman was taken to hospital & a vehicle arrived to take the deceased lady to hospital. I will visit their families to express heartfelt condolences & all support. https://t.co/RMPNQiR1MU

— GVL Narasimha Rao (@GVLNRAO) August 24, 2018