Madhavi Latha: సినీనటి బీజేపీ మహిళా నేత మాధవి లత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈమె ఎలాంటి విషయాలైనా నిర్మహమాటంగా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులే వివాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవల డిసెంబర్ 31వ తేదీ మహిళలు ఎవరు కూడా తాడిపత్రిలో జే సీ పార్క్ వైపుకు వెళ్లదు అంటూ ఈమె ఒక వీడియోని విడుదల చేశారు అయితే ఆ వీడియో పై ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది. ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే కొంతమంది నేటిజన్స్ ఈమెపై భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తనని ఆంటీ అంటూ విమర్శించడమే కాకుండా ముసలి దానివి అయిపోయావు మొహం మొత్తం ముడతలు పడిపోయింది అంటూ బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తున్నారు. అలా కామెంట్లు చేసిన వారికి కూడా ఈ సందర్భంగా ఈమె ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
కొందరు పొట్ట బట్ట ఉన్న అంకుల్స్ కూడా నన్ను ఆంటీ అని పిలవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కొంతమంది సైకోస్ నన్ను ముసలిదానివి అయిపోయావు అంటున్నారు వయసు జీవితం శాశ్వతం వాళ్ళకి కూడా కాదు అనే నిజాన్ని వాళ్ళు ఎలా మర్చిపోయారని ఈమె మండిపడ్డారు. నా వయసు ఉండి మరణం అంచులలో ఉన్న వాళ్లు కూడా నన్ను ఆంటీ అంటుంటే నా ఒక్కదానికే వయసు అయిపోతుందా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు నన్ను ముసలి దానివి, వయసు అయిపోతుంది ఆంటీ అంటూ మాట్లాడే వారందరూ కూడా అలాగే శాశ్వతంగా ఉండిపోతారా? అంటూ సెటైర్లు వేశారు.
నేను సృష్టి ధర్మాన్ని నమ్ముతాను మనిషి పుట్టిన తర్వాత వయసు పెరుగుతుంది ముసలి వాళ్లు అవ్వాల్సిందే తెల్ల జుట్టు రావాల్సిందే నేను ఈ సృష్టి ధర్మాన్ని నమ్ముతాను అలాగే వాటిని స్వీకరిస్తానని తెలిపారు. అలాంటప్పుడు మీరు నన్ను ఆంటీ అన్న అవ్వ అన్న నాకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు. మీరు ఇలా నా గురించి కాకుండా మీకోసం మీరు ఆలోచిస్తే బాగుంటుందని ఈమె సలహాలు కూడా ఇచ్చారు.. వయసు అనేది ఎవరికి శాశ్వతం కాదు నీ గురించి మీరు ఆలోచిస్తే నా వయసు వచ్చేసరికి కనీసం అంకుల్స్ కాకుండా ఉంటారంటూ మాధవి లత ఆంటీ తనపై చేసిన కామెంట్లకు తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు.