బీఆరెస్స్ పై వైసీపీ కౌంటర్స్ మొదలైపోయాయి!

గతంలో కేసీఆర్ ఒక స్కెచ్ వేశారంటే… మహా మహా రాజకీయ ఉద్దండులు కూడా దానికి కౌటర్స్ వేయలేకపోయేవారని అంటుంటారు. కానీ గత కొంతకాలంగా… కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ నిర్ణయానికి, ఆ ప్రకటలనకు కౌంటర్స్ ఈజీగా పడిపోతున్నాయి.. అవి కూడా లాజికల్ కౌంటర్స్. ఇందుకు కారణమైంది తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటన!

ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో… ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తుంది. ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతుంది. ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ చేస్తున్న రిక్వస్ట్ లలో ఇది ప్రధానంగా ఉంటున్న పరిస్థితి. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే… ఈ విషయాన్ని ఎప్పుడో లైట్ తీసుకుంది! తనను గాజువాకలో గెలిపించి ఉంటే విశాఖ స్టీల్ కోసం గట్టిగా నిలబడేవాడినని ఇప్పటికే జనసేన అధినేత క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉన్న గ్యాప్ ని క్యాష్ చేసుకోవాలని రంగంలోకి దిగారు కేసీఆర్. ఈ విషయంలో ఇప్పటికే మోడీకి ట్వీట్లు, లేఖలు కేటీఆర్ రాస్తే… విశాఖ స్టీల్ ని అమ్మితే సింగరేణి సంస్థలతో బిడ్ వేస్తాం అని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయాలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

పొరుగున ఉన్న బీఆరెస్స్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మవద్దు అంటూ కేంద్రాన్ని ఒక పక్క కోరుతూనే మరో వైపు అమ్మకానికి పెడితే బిడ్డింగులో పాల్గొంటామని ఎలా అంటుందని గుడివాడ అంటున్నారు. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ని అలాగే ఉంచాలని కోరుతున్నపుడు.. ఇక అమ్మకాలు కొనుగోళ్ల ప్రసక్తి ఎందుకు వస్తుందనేది ఆయన లాజికల్ పాయింట్! దీంతో… కేసీఆర్ చాణక్యానికి అమర్నాథ్ గట్టి కౌంటర్ వేశారని అంటున్నారు.

ఉక్కు కర్మాగారం ప్రైవేటేజేషన్ విధానాల మీద కేంద్రం పైన పోరాటం చేస్తామని ఈ మధ్యనే బీఆరెస్స్ ప్రకటించింది. తాజాగా విశాఖలో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాలలో కూడా ఏపీ బీఆరెస్స్ నాయకులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతలోనే కేంద్రం అమ్మకానికి పెడితే బిడ్ వేస్తామని బీఆరెస్స్ చెబుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో… బీఆరెస్స్ పోరాటాల్లో సెకండ్ ఆప్షన్ కూడా ఉందా అని సెటైర్లు పడుతున్నాయి. చావో రేవో ప్రైవేటైజేషన్ ఆపుతామని చెప్పాల్సిన ఉద్యమ పార్టీ… అమ్మకండి.. అమ్మితే మాకే అమ్మడి అని బేరసారాలాడటం కరెక్ట్ కాదనేది కొందరి వాదన!

సరిగ్గా ఇదే లాజిక్ ని పట్టుకుని బీఆరెస్స్ పై కౌంటర్ వేశారు అమర్నాథ్. మరి ఈ విషయాలపై బీఆరెస్స్ నేతలు ఎలాంటి స్పష్టత ఇస్తారనేది వేచి చూడాలి!

Gudivada Amarnath Reacts over KCR Comments on Visakha Steel Plant Privatization |@SakshiTV