గ్రేట‌ర్ విశాఖ‌.. 52వ వార్డు బొత్స అనుంగు శిష్యుడిదే గెలుపు

Greater Visakhapatnam..52nd Ward Jiyani Sridhar wins Municiple elections
Greater Visakhapatnam..52nd Ward Jiyani Sridhar wins Municiple elections
Jiyyani-Sridhar

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మున్సిప‌ల్ ఎన్నిక‌లు అట్టుడికిస్తున్నాయి. ప్ర‌చారం హోరెత్తుతోంది. మార్చి 10న పోలింగ్ కి స‌మ‌య‌మాస‌న్నమ‌వ్వ‌డంతో అభ్య‌ర్థులంతా రేప‌టి సాయంత్రం 5పీఎంతో ప్ర‌చారం ముగించాల్సి ఉంది. అటుపై పోలింగుకి స‌ర్వ‌స‌న్నాహ‌క‌మే. ముఖ్యంగా ఈసారి ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ కాబోతున్న గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ ఎన్నిక‌ల వార్ పీక్స్ కి చేరుకుంది. ఏపీ వ్యాప్తంగా వైకాపా హ‌వా సాగినా.. విశాఖ నలు దిక్కు‌లా తేదేపా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచింది. అలాంటి చోట‌ ఈసారి మున్సిపోల్స్ లో మాత్రం వైకాపా హ‌వా సాగ‌డం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా కానీ.. న‌గ‌రంలో 52వ వార్డులో పోటీ చేస్తున్న ప్ర‌స్తుత కార్పొరేట‌ర్.. వైకాపా పార్టీ 52వ వార్డ్ ప్రెసిడెంట్ జియ్య‌ని శ్రీ‌ధ‌ర్ గెలుపు త‌థ్యం అన్న టాక్ ప్ర‌జ‌ల్లో బ‌లంగా వినిపిస్తోంది. జియ్య‌ని వారి ట్రాక్ రికార్డ్ విశాఖ‌ NAD-జంక్ష‌న్ లో మార్మోగుతోంది. ఆయ‌న రాజ‌కీయ చ‌రిత్ర ప‌రిశీలిస్తే ఎన్నో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలే ఉన్నాయి. కాంగ్రెస్ యువ‌నాయ‌కుడిగా ఆయ‌న అంచెలంచెలుగా ఎదిగారు. అస‌లు పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే రెబ‌ల్ గా పోటీప‌డి విశాఖ‌ పుర‌పోరులో గెలిచిన చ‌రిత్ర ఆయ‌న‌ది. యువ‌నాయుకుడిగా గెలిచాక ఆయ‌న‌ కాంగ్రెస్ లోకి వెళ్లారు. చాలా కాలం కాంగ్రెస్ కే సేవ‌లందించారు. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు. జియ్య‌ని శ్రీ‌ధ‌ర్.. బొత్సకు అనుంగు శిష్యుడు. సీఎం జ‌గ‌న్ కి.. మంత్రి అవంతికి స‌న్నిహితుడిగా మెలుగుతారు. ఈయ‌న ఉంటే వైకాపాకి బ‌లం అన్న భావ‌న పార్టీలో ఉంది.

ఇంత‌కుముందు ఆయ‌న 42వ వార్డులో పోటీ చేసి గెలిచారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌కు ఆప‌ద్భాంద‌వుడే అయ్యాడు. మంచి ప‌నుల‌తో నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉంటూ సిస‌లైన నాయ‌కుడిగా అంద‌రి మ‌న‌సు దోచుకున్నాడు. వార్డుల పున‌ర్విభ‌జ‌న‌లో 42వ వార్డు ఇటీవ‌ల‌ 52వ వార్డుగా మారింది. గ‌తంలో పోటీ చేసిన అదే వార్డులో శ్రీ‌ధ‌ర్ పోటీ చేస్తున్నారు. ప‌రిస‌రాల్లోని ప్ర‌జ‌లంతా ఆయ‌న‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. “గెలుపు త‌థ్యం.. మెజారిటీ ఎంత అనేదే ఆలోచించాలి‌“ అన్న టాక్ ప్ర‌జ‌ల్లోనే వినిపిస్తోంది. ఆయ‌న వైకాపా పార్టీ ఎన్.ఏ.డీ కార్యాల‌యంలో 24/7 ఎప్పుడూ ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటారు. శ్రీ‌ధ‌ర్ గారూ అంటూ ఇంటికి వ‌చ్చినా ఆఫీస్ కి వ‌చ్చినా స‌మ‌స్య తీర్చ‌నిదే వ‌దిలి పెట్ట‌ని నైజం ఆయ‌న‌ది. త‌న కోసం వ‌చ్చిన వారిని ఆదుకుంటా‌ర‌న్న మంచి టాక్ ఉంది.

అధికారం ఉన్నా లేక‌పోయినా ప్ర‌జ‌ల‌తోనే ఉండే నాయ‌కుడిగానూ యువ కార్పొరేట‌ర్ జియ్య‌ని శ్రీ‌ధ‌ర్ కి చ‌క్క‌ని గుర్తింపు ఉంది. అందుకే ఈసారి స్వ‌చ్ఛందంగా ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి ఆయ‌న‌కు ప్ర‌జ‌లంతా ప్ర‌చారం చేస్తున్నారు. అనునిత్యం వేలాది కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న కార్యాల‌యం నిండుతోంది. ప్ర‌చారానికి త‌ర‌లి వ‌స్తున్న జ‌నాన్ని చూస్తే అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఈయ‌న 52 వ వార్డు ప్ర‌జ‌లే కాకుండా ఇరుగుపొరుగు వార్డు ప్ర‌జ‌లు కూడా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న వ‌ద్ద‌కే చేరడం కొస‌మెరుపు. బొత్స స‌హా నేరుగా పార్టీ అధినాయ‌కుల‌తోనే ఆయ‌న స‌త్సంబంధాలు కూడా ఈ సాన్నిహిత్యానికి ఒక కార‌ణం అని చెబుతున్నారు. ఎన్నో సామాజికాంశాల్లో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉన్నారు. వితంతు- వృద్ధాప్య‌-దివ్యాంగ ఫించ‌న్లు.. ఇండ్ల స్థ‌లాల స‌మ‌స్య‌ల్ని ఆయ‌న ప‌రిష్క‌రించారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఆయ‌న ఎన్నో సేవ‌లందించారు. ఇప్పుడు వీరంతా ఆయ‌న వెంటే వ‌స్తున్నారు. ఆ నియోజ‌క వ‌ర్గం నుంచి గోడు వినిపించే ప్ర‌జ‌లంతా ఆయ‌న‌నే క‌లుస్తున్నారు.

ఇటీవ‌ల విశాఖ‌ LG పాలిమర్ ట్రాజిక్ గ్యాస్ లీక్ ఘ‌ట‌న అనంత‌రం‌ వెంటనే స్పందించింది జియ్య‌ని శ్రీ‌ధ‌ర్ గారే అని ప్ర‌జ‌లు చెబుతారు. వెంట‌నే స్పాట్ కి వెళ్లి బాధిత ప్ర‌జ‌ల‌కు ఆప‌త్కాలంలో సాయం చేశారు. అక్కడే దగ్గర ఉండి మొత్తం ప్రజలకు అండగా నిలిచారు.

ప్ర‌జ‌ల్లో టాక్ ని బ‌ట్టి 52వ వార్డులో జియ్య‌ని శ్రీ‌ధ‌ర్ గెలుపు త‌థ్యం అన్న ధీమా వ్య‌క్త‌మ‌వుతోంది. తేదేపా ప్ర‌త్య‌ర్థి కె.నాగేశ్వ‌ర‌రావుపై స్ప‌ష్ఠ‌మైన మెజారిటీతో గెలుస్తార‌ని ఓట‌రు నాడి చెబుతోంది.

ఒక‌మారు ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం చూస్తే… 2007లో జియ్య‌ని శ్రీ‌ధ‌ర్ విశాఖ కార్పొరేట‌ర్ గా ఎన్.ఏ.డీ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ప్ర‌ధాన పార్టీలు బ‌రిలో ఉండ‌గా ఇండిపెండెంట్ గా గెలుపు అంటే ఆషామాషీ కాదు. కానీ సాధించి చూపించారు. ఇందిరాగాంధీ-రాజీవ్ గాంధీ హ‌యాం నుంచి ఆయ‌న కాంగ్రెస్ అభిమానిగా కొన‌సాగారు. ఆ స‌మ‌యంలోనే కాంగ్రెస్ అభిమానిగా దిల్లీ వెళ్లి ఇందిర‌మ్మ‌నే క‌లిసారు. 1989 నుంచి 1993 వ‌ర‌కూ కాంగ్రెస్ సేవాద‌ళ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 1993 నుంచి 1997 వ‌ర‌కూ వైజాగ్ సిటీ యూత్ కాంగ్రెస్ నాయ‌కుడిగా కొన‌సాగారు. కాల‌క్ర‌మంలో వైకాపా అధినాయ‌కుల‌కు చేరువై పార్టీలో చేరారు. అన‌తికాలంలోనూ అధినాయ‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం వైకాపా కార్పొరేట‌ర్ గా సేవ‌లందిస్తున్నారు.