ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. గురుకుల విద్యాలయాలలో 5వ తరగతి అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే అడ్మిషన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా మార్చి 24వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయల కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రమే ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2012 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం మధ్యలో జన్మించిన ఓసీ, బీసీ, కన్వర్టెడ్ క్రిస్టియన్లు 2010 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం మధ్యలో జన్మించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
https://apgpcet.apcfss.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా అడ్మిషన్ల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తేదీన పరీక్ష జరగనుంది. సమీపంలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులను సమర్పించాలి. పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరగనుందని సమాచారం అందుతోంది.
విద్యార్థులు ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తుకు సంబంధించి ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ను పొందవచ్చు.