వాళ్ళంతా గౌతమ్ సవాంగ్ కే చుక్కలు చూపిస్తున్నారు .. బాబోయ్ ఇది పరాకాష్ట !

Gautam Sawang's statements have triggered angry reactions from the TDP and BJP leadership

ఆంధ్రప్రదేశ్: ఆలయాల మీద జరిగిన దాడుల మీద శుక్రవారం నాడు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కుట్రల వెనుక ఎవరున్నారన్నది బయట పెట్టారు. ఈ దాడుల వెనుక టీడీపీ, బీజేపీ పార్టీలకి చెందిన కార్యకర్తలే ఉన్నారని ఆయన ప్రకటించారు. ఆ కేసుల వివరాలను తర్వాత మీడియాకు ఇచ్చారు. అందులో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఆలయాలపై దాడుల కేసు లేదు. సోషల్ మీడియా ప్రచారాల గురించే ఉంది. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అంబటి రాంబాబు,పేర్ని నాని, కొడాలి నానిలా డీజీపీ ఒక వైసీపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

Gautam Sawang's statements have triggered angry reactions from the TDP and BJP leadership
Gautam Sawang’s statements have triggered angry reactions from the TDP and BJP leadership

ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ మాట్లాడుతూ… గౌతం సవాంగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ధ్వంసం చేయాలని పరోక్షంగా రెచ్చగొట్టిన.. మంత్రి కొడాలి నానిని వెంటనే అరెస్ట్‌ చేయాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు గౌతం సవాంగ్‌ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో రాసిచ్చిన స్క్రిప్టులు చదవకపోతే.. పోస్టు పీకేస్తారని భయపడుతున్నారని అందుకే పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ నేతలు రంగంలోకి దిగి డీజీపీకి మద్దతుగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. పోలీసులు నిష్పక్షిపాతంగా విచారణ చేస్తున్నారని వాదిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అన్ని వ్యవహారాల వెనుక చంద్రబాబు ఉన్నారని తేల్చి చెప్తున్నారు. మొత్తానికి ఆలయాలపై దాడుల వ్యవహారంలో నిజమైన నిందితుల్ని పట్టుకుంటే ఇంత రాజకీయం అయి ఉండేది కాదు.. కానీ.. వాటిని వైసీపీకి అంటించాలని విపక్షాలు.. విపక్షాలకు అంటించాలని వైసీపీ ప్రయత్నిస్తూండటంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయ పార్టీలన్నీ మత రాజకీయం చేస్తుంటే నిజాల్ని బయటపెట్టాల్సిన పోలీసులు కూడా ఆ రాజకీయంలో భాగస్వామ్యులు కావటం మంచి పరిణామం కాదని విశ్లేషకులు విచారిస్తున్నారు.