నిమ్మగడ్డతో పోరు మంచిది కాదు ..ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎస్ కీలక వ్యాఖ్యలు!

ap cm ys jagan versus nimmagadda ramesh

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాగా ప్రభుత్వ అధికారులు సైతం ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికల సంఘానికి ఓ రకంగా ప్రభుత్వ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది.

ap volunteers should not participate in panchayat elections tdp alleges

ఈ పరిణామాలపై గతంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ముఖ్య కార్యదర్శి సాధారణ సమయంలో ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ నిర్ణయాలను అమలు చేయను అనటం ఎలాగో ఈ సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయాలను అమలు చేయకపోవటం అలాగే అవుతుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో లోపాలుంటే సంబంధిత అధికారులు కోర్టుకు వెళ్లాలి. కానీ అమలు చేయను అనే అధికారం ముఖ్య కార్యదర్శికి లేదు అని రిటైర్డ్ ఐఏఎస్ తెలిపారు.

రాష్ట్ర రాజకీయ నాయకత్వం అనాలోచిత చర్యలతో రాష్ట్ర అధికారులకు నివారించదగిన సమస్యలను తెచ్చి పెడుతున్నది. ఎన్నికల సమయంలో ఎన్నికల అంశాల వరకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉంటాయి అని ఐవైఆర్ తెలిపారు. ఇదిలా ఉంటే