పాపం పునేఠా..చంద్రబాబును నమ్ముకున్న ఫలితం..పోస్టింగ్ కూడా లేదు

పాపం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా పూర్తిగా  దెబ్బతినేశారు.  ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటశ్వరరావు బదిలీ విషయంలో చంద్రబాబునాయుడును నమ్ముకుని కేంద్ర ఎన్నికల కమీషన్ తో సున్నంపెట్టుకున్నందుకు సర్వీసులో ఘొరంగా దెబ్బతిన్నారు. ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉన్నపుడు తాను ఈసికి మాత్రమే జవాబుదారీ అని తెలిసి కూడా చంద్రబాబు మాటవిని కోర్టుకెక్కిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నారు.

చీఫ్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తి ప్రస్తుతం ఎటువంటి పోస్టింగ్ లేకుండా పోస్టు కోసం వెయిట్ చేస్తున్నారంటే ఎంతటి అవమానం. ఈసికి ఎదురితిరిగిన ఫలితాన్ని పునేఠా ఇపుడు అనుభవిస్తున్నారు. తనతో తప్పు చేయించిన చంద్రబాబు బాగానే ఉన్నారు. చంద్రబాబును నమ్ముకుని ఈసికి ఎదురుతిరిగన పునేఠానే ఇరుక్కుపోయారు.

మే 31వ తేదీన పునేఠా రిటైర్ అవుతున్నారు. మే 23వ తేదీన ఫలితాలు వస్తాయి. ఏ పార్టీ గెలుస్తుందో తెలీదు. ఏ పార్టీ గెలిచినా ఎవరు ముఖ్యమంత్రయినా పునేఠాకైతే మళ్ళీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అయితే ఇక రాదన్నది వాస్తవం.  చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి లో ఎవరు సిఎం అయినా పునేఠానైతే మళ్ళీ సీఎస్ గా పోస్టింగ్ రాదు.  

సిఎస్ గా నియమితుయ్యే వ్యక్తికి రిటైర్మెంటుకు  కనీసం ఏడాది వ్యవధి ఉండాలి. నిబంధనల ప్రకారం పునేఠాకు ఉన్నది మహా అయితే 40 రోజులే. మే 23వ తేదీన ఫలితాలు వచ్చినా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. కాబట్టి పునేఠా రిటైర్మెంటుకు వీలుగా ఎక్కడో ఓ చోట ఏదో ఓ పోస్టులో నియమిస్తారు. కాబట్టి ఆ పోస్టులోనే రిటైర్ అయిపోతారు.