ఆంధ్రప్రదేశ్‌లో పండగ రాజకీయం.!

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పండగని ‘రాజకీయం’ కోసం గట్టిగా వాడేశాయి. ఊరూ వాడా ఫ్లెక్సీలమోత మోగించేశాయి. స్థానిక నాయకులు, కనీ వినీ ఎరుగని రీతిలో ఖర్చు చేశారు. అదేంటీ, అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా.? అన్న భావన కలిగింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా.

‘ఈసారి వైసీపీకి డజను సీట్లు కూడా రావట కదా.?’ అంటూ ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్ర రాజకీయాల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రాయలసీమలోనూ ఈ సారి వైసీపీకి చేదు అనుభవం తప్పకపోవచ్చ’ అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. మిగతా జిల్లాల్లోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.

ఇదంతా గ్రౌండ్ లెవల్ టాక్ అనుకోవచ్చా.? అంటే, కాదు కాదు ఇది కూడా పెయిడ్ టాక్.! టీడీపీ కాస్తంత కొత్తగా ఆలోచించి, పండక్కి ఈ తరహా ప్రచారానికి తెరలేపింది. వైసీపీ తక్కువేం తిన్లేదు, వైనాట్ 175 అంటూ హడావిడి చేయడం కనిపించింది. ఫ్లెక్సీలు, ఐవీఆర్ ఫోన్ కాల్స్.. ఇదీ సందడి.!

కోడి పందాల బరుల్లోనూ, ఇతరత్రా ముఖ్యమైన ప్రాంతాల్లోనూ, అధికార విపక్షాల మధ్య అక్కడక్కడా గలాటా కనిపించింది. ఓవరాల్‌గా సినారియో చూస్తే, వైసీపీ నేతలే ‘ఎలాగోలా ఈసారికి గట్టెక్కితే చాలు..’ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

టీడీపీ – జనసేన పొత్తు సత్ఫలితాలనివ్వాలంటే, రెండు పార్టీల మధ్య ముందైతే సీట్ల షేరింగ్ సరిగ్గా కుదరాలన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు జనసేనకు ఇవ్వడం వల్లే టీడీపీకి లాభమట.! కానీ అందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు.

తమ గెలుపు ఈసారి టీడీపీ – జనసేన మధ్య సీట్ల షేరింగుని బట్టి ఆధారపడి వుంటుందని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు.