సామాధి అయిపోయిన టీడీపీకి అతిపెద్ద ఆశాకిరణం ఇదే ?

TDP Christian cell presidents resignations 

ప్రకాశం జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. మంచి వాక్చాతుర్యంతోపాటు.. దూకుడు ఉన్న నాయ‌కులు ఈ జిల్లాలో క‌నిపిస్తారు. అయితే.2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఇక్క‌డ కేవ‌లం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఈ న‌లుగురిలో చీరాల నుంచి గెలిచిన సీనియ‌ర్ నాయ‌కుడు.. క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారిపోయారు. వాస్తవానికి ఈయ‌న వ‌ల్ల పార్టీకి గ‌తంలోను, ఇప్పుడు కూడా ఎలాంటి ప్రయోజ‌నం లేకుండా పోయింది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న శిద్ధా రాఘ‌వ‌రావు కుటుంబం కూడా ఫ్యాన్ కింద‌కు చేరిపోయింది. మిగిలిన వారిలో చాలా మంది మౌనంగా ఉంటున్నారు.

TDP Christian cell presidents resignations 

అయితే.. ఓ ఇద్దరు కీల‌క నేత‌లు మాత్రం టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలుస్తుండ‌డంతో పాటు పార్టీకి జిల్లాలో ఆశాకిర‌ణంగా, మార్గద‌ర్శకంగా నిలుస్తున్నారు. ఏలూరి సాంబ‌శివ‌రావు , గొట్టిపాటి ర‌వి కుమార్‌లు ఇద్దరూ కూడా పార్టీ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నా దూసుకు పోతున్నారు. స‌హ‌జంగానే పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిప‌క్ష నేత‌పై ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి టీడీపీ నేత‌ల‌పై ఒత్తిళ్లు వ‌చ్చాయి. పార్టీలు మారిపోవాలంటూ.. తీవ్రంగా వేధింపులు కూడా ఎదుర‌య్యాయి.

అయితే ఆ వేధింపులు త‌ట్టుకోలేని వారు, పార్టీ మారిపోగా పార్టీకోసం ఎన్ని వేధింపులు వ‌చ్చినా ఎదుర్కొంటామ‌నే రీతిలో ఈ ఇద్దరు వ్య‌వ‌హ‌రించారు. ఏలూరి, గొట్టిపాటి పార్టీ మారిపోతున్నారంటూ అధికార పార్టీ ఎంత మైండ్ గేమ్ ప్రచారం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీరు ఏ మాత్రం జంక‌లేదు. ముఖ్యంగా బాప‌ట్ల పార్లమెంటు ప‌రిధిలోకి వ‌చ్చే తూర్పు ప్రకాశంలో ఏలూరి, గొట్టిపాటిలు పార్టీకి అండ‌గా ఉన్నారు. ఏలూరి ఏకంగా చంద్రబాబు తోడ‌ళ్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావును ఓడించ‌డంతో పాటు ఆయ‌న ప‌డుతోన్న క‌ష్టాన్ని ప్రత్యేకంగా గుర్తించారు.

ఈ క్రమంలోనే ఆయ‌న‌కు బాప‌ట్ల పా ర్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ ప‌ద‌విని అప్పగించారు.ఇక‌, గొట్టిపాటి ర‌వి విష‌యానికి వ‌స్తే తిరుగులేని వ్యక్తిగ‌త ఇమేజ్ ఉంది. కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ర‌విదే గెలుపు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వ‌చ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ర‌వికుమార్ చ‌రిత్ర క్రియేట్ చేశారు. ఇద్దరు నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీని ఎదుర్కొని టీడీపీని నిల‌బెడుతున్నట్టే ఇత‌ర నేత‌లు కూడా క‌ష్టప‌డితే ప్రకాశంలో టీడీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం లేకపోలేదు.