తెలంగాణలో ప్రారంభమైన ఎలక్షన్ కౌంటింగ్

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల నిఘాతో కౌంటింగ్ నడుస్తోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు లెక్కిస్తున్నారు. 8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. రెండు గంటల్లోనే ఫలితాల పై క్లారిటి రానుంది. పోటిలో ఉన్న అభ్యర్దులంతా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో వచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో లెక్కింపు నడుస్తోంది. హైదరాబాద్ లో 13 కేంద్రాల్లో , జిల్లాలల్లో 30 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. అన్ని కేంద్రాల వద్ద కూడా  పటిష్ట భద్రత ఉంది. అధికారులు దగ్గరుండి కౌంటింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. పాస్ ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. శేరిలింగంప‌ల్లిలో అత్య‌ధిక రౌండ్ల‌లో, బెల్లంప‌ల్లిలో అత్య‌ల్ప రౌండ్లలో లెక్కింపు జ‌రుగనుంది. 2379 రౌండ్స్‌లో లెక్కింపు పూర్త‌వుతుంది.

 కౌంటింగ్ కేంద్రాల వద్ద అందరు అభ్యర్దులు ఉత్కంఠగా కనిపిస్తున్నారు. అందరిలోను టెన్షన్ వాతావరణం మొదలైంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికల ఫలితాల పై క్లారిటి రానుంది. మూడంచెల భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది.