మూడు పెగ్గులు ఆరు గ్లాసులు.. ఈనాడు చెప్పినట్టే వాస్తవంగా జరుగుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఎల్లో మీడియా పత్రికలలో ఒకటైన ఈనాడు మాత్రం మూడు పెగ్గులు ఆరు గ్లాసులు అంటూ వైసీపీ సర్కార్ ను కించపరిచేలా కథనాన్ని ప్రచారం చేస్తోంది. 26 జిల్లాలలో 154 బెల్టు షాపులను గుర్తించామని ఈనాడు చెబుతోంది.

ఫోన్ కొడితే ఇంటికే మద్యం డెలివరీ అవుతోందని బైక్స్, ఆటోల ద్వారా మద్యం సరఫరా జరుగుతోందని ఈనాడు చెబుతోంది. కొంతమంది ప్రభుత్వ దుకాణాలలో మద్యం కొనుగోలు చేసి అదనపు ధరకు అమ్ముతున్నరని ఈనాడు వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతి జిల్లాకు ఒక ఊరిలో పరిశీలించగా 2 నుంచి 3 బెల్ట్ షాపులను గుర్తించామని ఈనాడు పేర్కొంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ దందాను నిర్వహిస్తున్నాయని ఈనాడు వెల్లడించింది.

అయితే ఈనాడు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అందుబాటులో ఉండగా అదనపు ఖర్చులు భరించి డోర్ డెలివరీ కోరుకునే వాళ్లు ఎందుకు ఉంటారనే ప్రశ్న వినిపిస్తోంది. చిన్నచిన్న గ్రామాల్లో, పట్టణాల్లో ఎవరైనా ఒక పూట కూలీకి వెళితే 500 రూపాయల ఆదాయం వస్తోంది. ఇలాంటి తరుణంలో డెలివరీ ద్వారా వచ్చే 10, 20 రూపాయల ఆదాయాన్ని ఎవరూ ఆశించరు.

ఈ లాజిక్ లను ఈనాడు ఎలా మిస్సైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీపై బురద జల్లడమే లక్ష్యంగా ఈనాడు కథనాలను ప్రచారం చేస్తోంది. ఈనాడు కథనాల గురించి వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.