తప్పదు వెళ్ళాల్సిందే, ఏపీకి గుడ్ న్యూస్ కోసం ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కిన వైఎస్ జగన్ 

AP Venkataeswararao condemns AP government suspension orders 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయనే వార్తలు రాజకీయవర్గాలలో జోరుగా వినపడుతున్నాయి.  ప్రస్తుత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  లోటు బడ్జెట్, రెవేయు లోటు ఉన్నాసరే ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు.  ఆదాయం అసలే లేదు.  అందుఎక్ దొరికిన చోటల్లా అప్పులు తెస్తున్నారు.  రోజు మొదలైతే ఎప్పుడు ఎక్కడ ఎలా అప్పు పుడుతుందా అని వెతకడమే ఆర్ధిక శాఖ పనైపోయింది.  అప్పుల భారం పెరిగిపోతోంది.  ఈమధ్య విడుదలైన కాగ్ నివేదిక కూడ ఇదే చెబుతోంది.  
 
YS Jagan planning for Delhi tour
ప్రజల్లో సైతం అప్పుడలా భారం పెరుగుతోందనే భావం మొదలైంది.  ఎందుకంటే అదే నిజం.  2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పులు 2.59 లక్షల కోట్లు.  ఇక జగన్ పీఠం ఎక్కాక ఒకటిన్నర ఏడాదిలో 1.62 లక్షల కోట్ల అప్పు తెచ్చినట్టు కాగ్ చెబుతోంది.  అంటే బాబు ఐదేళ్ళలో చేసిన అప్పు కంటే జగన్ ఒకటిన్నర సంవత్సరంలో చేసిన అప్పులే ఎక్కువ.  అంటే నెలకు 8000 కోట్లకు పైనే అప్పులు చేశారు.  ఇప్పుడు చేస్తున్నట్టు అప్పులు చేసుకుంటూ పొతే ఐదేళ్ల తర్వాత 4 లక్షల కోట్లకు పైనే అప్పులు అవుతాయి.  దీని గురించి అందరూ దిగులుపడుతున్నట్టే జగన్ సైతం కంగారుపడుతున్నారు. 
 
అందుకే కేంద్రం సహాయం కోరడానికి ఢిల్లీ వెళ్లే యోచన చేస్తున్నారట.  త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  అందులో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించాలని, పోలవరం రీఎంబర్సిమెంట్ నిధులు వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని కోరాలని భావిస్తున్నారట.  పైపెచ్చు కొత్తగా ఉచిత ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు.  దీనికి భారీగా నిహాదులు కావాల్సి ఉంటుంది. మొదటి దఫాలో 15 లక్షలు, రెండవ దఫాలో 12 లక్షల ఇళ్ళు కట్టించాల్సి ఉంది,  ఇందుకు లక్ష కోట్ల వరకు నిధులు కావాలి.  ప్రస్తుతం పథకం ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి స్థలాలు కొనడం వరకే ఖర్చు పెట్టారు.  ముందుముందు భారీగా నిధులు రిలీజ్ చేయాలి.  నిధులు లేకపోతే ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు పడతాయి.  అలా జరిగితే ప్రభుత్వ ప్రతిష్ఠకే భంగం.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనుకున్నవన్నీ జరగాలంటే  కేంద్రం సహకారం తప్పనిసరి అని భావించే ఈ ఢిల్లీ టూర్ ప్లాన్ చేసున్నారట.