HomeAndhra Pradesh నాని చుట్టూ పెద్ద ఉచ్చు.. అందరూ కలిసి ఇరికించేశారట ?

 నాని చుట్టూ పెద్ద ఉచ్చు.. అందరూ కలిసి ఇరికించేశారట ?

వైసీపీ తరపున ఎప్పుడూ వార్తల్లో నిలిచే నాయకుల్లో మంత్రి కొడాలి నాని ఒకరు.  ఆయన నోరు తెరిస్తే ప్రత్యర్థులకు తిట్ల దండకం మొదలైనట్టే.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకొంతమంది టీడీపీ నాయకుల మీద నాని బూతులతో విరుచుకుపడిపోయేవారు.  మొదట్లో ఆయన మాటలను వైసీపీ నేతలు తెగ ఎంజాయ్ చేశారు.  జనం సైతం కాస్త ఆసక్తిగా గమనించారు.  కానీ ఏదైనా సరే అతిగా చేస్తే విషమించక మానదు అన్నట్టు నాని అదే నోటి దురుసును కంటిన్యూ చేయడం అధికార పార్టీని ఇరుకునపడేసింది.  వైసీపీ అనుకూల మీడియా నాని మాటలను హీరోయిజంలా ప్రాజెక్ట్ చేసినా ప్రజలకు విజ్ఞత అంటూ ఒకటి ఉంటుంది.  అదే వ్యతిరేకతను లేవదీసింది.  
 
His Own Party Leaders Targetc
His own party leaders targetc
పాలసీల గురించి మాట్లాడటం , వస్తున్న ఆరోపణల విషయంలో తమ నిజాయితీని నిరూపించుకోవడం మీద దృష్టి పెట్టని మంత్రిగారు మీటింగ్ పెడితే ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడే పనినే చేశారు.  అదే నచ్చలేదు ప్రజలకు.  ఎప్పుడూ తిట్లేనా.. ఒక్కసారైనా మళ్ళీ మళ్లీ వినాలనిపించేలా ఏదైనా విషయం పరిజ్ఞానం ఉన్న మాటలు మాట్లాడొచ్చు కదా అంటూ మండిపడ్డారు.  సొంత పార్టీ నేతలు సైతం నాని దూకుడును కంట్రోల్ చేసుకోవాలని ఆఫ్ ది రికార్డ్ అన్న సందర్భాలు చాలానే ఉన్నాయట.  అయినా వినిపించుకొని నాని చివరికి అందరికీ టార్గెట్ అయిపోయారు. 
 
ఇటీవల కృష్ణా జిల్లాలో భారీగా నిర్వహిస్తున్న పేకాట డెన్ మీద పోలీసులు దాడిచేసి కొంతమంది జూదగాళ్ళను, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.  ఆ పేకాట శిబిరాలను కొడాలి నానియే నిర్వహిస్తున్నారని చంద్రబాబు నుండి ఆఖరి టీడీపీ లీడర్ వరకు ఆరోపిస్తున్నారు.  రోజుకు ఇద్దరు ముగ్గురు పెద్ద లీడర్లు  మీటింగ్లు పెట్టి మరీ నానిని విమర్శిస్తున్నారు.  ఆ ఆరోపణల్లో నిజముంటే సొంత మంత్రి మీద ప్రభుత్వం ఎలా దాడిచేయిస్తుంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది.  అయితే దీని వెనుక కూడ పెద్ద కథ ఉందట.  అదేమిటంటే నానిని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారని చెబుతున్నారు ప్రత్యర్థులు.  
 
నాని దూడుకుడు బ్రేకులు వేయాలనే ఉన్నదేశ్యంతోనే వైసీపీలో ప్రధాన సామాజివర్గానికి చెందిన ఒక పెద్ద నేత ఈ దాడులకు ప్లాన్ చేశారని, సరిగ్గా చూసి మరీ కార్నర్ చేశారని అంటున్నారు.  లేకపోతే సరిగ్గా పవన్ కళ్యాణ్ గుడివాడ పర్యటనలో పేకాట క్లబ్బులు అంటూ నాని గురించి మాట్లాడిన కొద్దిరోజులకే ఇలా సోదాలు జరగడం ఏంటి, నాని పేరు బయటకురావడం ఏమిటని  అంటూ నానిని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారని, ఈ పరిణామంతో నానికి ఏమీ అర్థంకాక  డైలమాలో పడిపోయారని చెబుతున్నారు.  
 

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News