JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ పోలీసు తీరు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల అనంతపురంలో జెసి ట్రావెల్స్ వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక బస్సు మొత్తం పూర్తిగా కాలిపోగా మరొక బస్సు సగభాగం కాలిపోయింది.
ఇలా బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పేశారు అయితే ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంటి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అక్కడ కరెంటు వైర్లు తెగిపడి ఉండడంతో బహుశా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇక అక్కడ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు వివిధ కోణాలలో ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు కాలిపోయిన ఘటనపై పోలీస్ వ్యవస్థను తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. బస్సు దగ్ధం కేసులో పోలీస్ విచారణ పై నాకు నమ్మకం లేదని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు తగలబడింది అంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సు కాలిపోలేదని పక్క పథకం ప్రకారమే బస్సుకు నిప్పు పెట్టారని ఈయన బూతులతో రెచ్చిపోయారు.
ఇలా తన బస్సుకు నిప్పు పెట్టిన వారు ఎవరో కనిపెట్టే దమ్ము ధైర్యం పోలీసులకు ఉందా అంటూ ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని.. పోలీసు ఉన్నతాధికారులకు న్యాయం చేయడం చేత కాదని ఈయన పోలీస్ వ్యవస్థ పై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ఈ ఘటనకు బీజేపీ నేతలే పాల్పడ్డారని ఈయన విమర్శించారు. మీ కంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు తను నా బస్సులను కేవలం నడవకుండా నిలబెట్టాడు కానీ మీలాగా కాల్చలేదు అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ బీజేపీ నాయకుల పై విమర్శలు కురిపించారు.