నేటి నుండే ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ !

ap cm ys jagan serious on prakasham ycp leaders

ఏపీలో లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నివాస స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలకు శుభ ముహూర్తం వచ్చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది జగన్‌ ప్రభుత్వం.

centre good news to ap cm ys jagan

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. కోర్టు వివాదలు ఉన్న ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది.

రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వేర్వేరు తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. కోస్తా జిల్లాల్లో ఇవాళ, రాయలసీమకు సంబంధించి ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, ఉత్తరాంధ్రకు ఈనెల 30న విజయనగరంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం 15 రోజుల పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఉగాది పండగ రోజున ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే విపక్షం దీనిపై కోర్టుకు వెళ్లడంతో అది వాయిదా పడింది. ఆ తర్వాత అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని తలిచింది. అదికూడా వాయిదా పడడంతో… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న పట్టాలు పంపిణీకి సిద్ధమయ్యింది. కోర్టు కేసులతో మరోసారి వాయిదా పడడంతో… వైఎస్‌ జయంతి రోజైన జులై 8, ఆ తర్వాత పంద్రాగస్టు, చివరికి గాంధీ జయంతిని కూడా ముహూర్తంగా నిర్ణయించారు. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు రేపు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇన్నాళ్లకు పేదల సొంతింటి కలను సాకారం చేయబోతోంది.