పవన్ కళ్యాణ్ ను అవమానించిన నరేంద్ర మోదీ.. కారణాలు ఇవేనా?

BJP needs Janasena support in Tirupati polls

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహం కలిగిస్తోంది. టీడీపీ, జనసేన మధ్య బంధం పెరగడం వల్ల బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెరిగిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. పీఎంవో నుంచి ఆహ్వానాలు అందుతాయని చెప్పి ఏపీ బీజేపీ నేతలు పవన్ కు ఆహ్వానానికి సంబంధించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారనే సంగతి తెలిసిందే.

జనసేనానికి సైతం బీజేపీ తనకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో అర్థమై ఉంటుంది. వేర్వేరు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన విధానమే ఈ పరిస్థితికి కారణమని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ నమ్మకాన్ని పవన్ కోల్పోయారని భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ కు మోదీ సపోర్ట్ లభించే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

11, 12వ తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఏపీకి ప్రయోజనం చేకూరేలా ఏవైనా ప్రకటనలు చేయొచ్చని ప్రచారం జరుగుతుండగా మోదీ నుంచి ప్రజలకు బెనిఫిట్ కలిగేలా ఎలాంటి హామీలు వస్తాయో చూడాల్సి ఉంది. జనసేన బీజేపీ బంధం దాదాపుగా లేనట్టేనని మోదీ పర్యటనతో క్లారిటీ వచ్చేసింది.

బీజేపీ సపోర్ట్ లేకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ వైసీపీ కలిసి పోటీ చేయడం కూడా పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం నచ్చడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ బంధాన్ని జనసేన త్వరలో తేల్చనుందని తెలుస్తోంది.