టీడీపీ వెన్నులో వణుకు.. ఆ ప్రతిపాదన వస్తే ఎన్టీఆర్ నో చెబుతారా?

ఎన్టీఆర్ అమిత్ షా భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి అమిత్ షా, తారక్ మధ్య ఏ విషయాలను సంబంధించిన చర్చ జరిగిందో వాళ్లిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు. ఈ భేటీలో మాట్లాడిన అంశాలకు సంబంధించి తారక్ మీడియాతో మాట్లాడకపోవడంతో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ భేటీ వల్ల ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో తారక్ నటనను ప్రశంసించడానికి అమిత్ షా ఎన్టీఆర్ ను పిలిపించారని ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తున్నా మరి రాజమౌళి, చరణ్ ను ఎందుకు పిలవలేదని చర్చ జరుగుతోంది. తారక్ పొలిటికల్ కెరీర్ కు బెనిఫిట్ కలిగేలా బీజేపీ నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే తారక్ సైతం నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. దాదాపుగా 30 నిమిషాల పాటు అమిత్ షా, ఎన్టీఆర్ మధ్య చర్చ జరిగింది.

ఈ భేటీ వల్ల ఎన్టీఆర్ అభిమానుల మనస్సు గెలుచుకునే విషయంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కేంద్రంలో మరికొన్ని సంవత్సరాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను చాలా సందర్భాల్లో టీడీపీ అవమానించిందనే సంగతి తెలిసిందే. ఆ అవమానాల గురించి నోరెత్తడానికి టీడీపీ నేతలు సైతం ఇష్టపడరు.

రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మార్పుకు తారక్ కారణమవుతారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తారక్ ప్రస్తుతం దెబ్బ తిన్న పులిలా ఉన్నారని చంద్రబాబు నాయుడు వేర్వేరు సందర్భాల్లో పొడిచిన వెన్నుపోట్లు తారక్ కు ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తారక్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.