ఈ సినిమా స్పెషల్ గా వైఎస్సార్ కోసం …!

ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు నాయుడు లేదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సేవలు అందుకున్నవారే. వారిద్దరి పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని చూశారు. వారు చేసిన అభివృద్ధి వల్ల తెలుగు రాష్ట్రాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్సార్, సీబీన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ లో పని చేశారు. ఇద్దరు కాలేజ్ నుండి కూడా స్నేహితులని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. వెనుక‌బ‌డిన రాయ‌ల‌‌సీమ నుంచి ఇంచుమించు ఒకే స‌మ‌యంలో రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన ఈ ఇరువురు..రాష్ట్ర ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసి స‌త్తా చాటారు.

పార్టీల సిద్దాంతాల ప‌రంగా వైరం ఉన్నా, ఇద్ద‌రి మ‌ధ్య మంచి మైత్రి కూడా ఉంది. అందుకే ఈ ఇద్ద‌రు నేత‌ల‌ స్నేహంపై ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. నూత‌న దర్శకుడు రాజ్ తెరకెక్కించనున్న ఈ మూవీని ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన‌ విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి నిర్మించ‌నున్నార‌ట‌.

ఇదే మూవీ కాకుండా ప్రస్థానం మూవీతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ దేవకట్టా కూడా ఒక మూవీ తీయబోతున్నారు. ఈ మూవీ వైఎస్సార్సీబీన్ ల నిజజీవిత స్నేహాన్ని ఆధారంగా చేసుకొని తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ అని దేవకట్టా తెలిపారు. ఆయన మూవీలో ఎవ్వరిని తక్కువ చేసి చూపించడం లేదా ఎక్కువ చేసి చూపించడం జరగదని దేవకట్టా తెలిపారు. ఈమూవీ వైఎస్సార్సీబీన్ ల యొక్క గౌరవం పెంచేలా ఉంటుందే కానీ వారిని అగౌరవ పరిచే విధంగా ఉండదని మూవీ యూనిట్ తెలిపింది. ఈ మూవీకి ఇంద్రప్రస్థం అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ మూవీని గాడ్ ఫాథర్ రేంజ్ లో తీస్తామని, ఈ మూవీ థియేటర్ కోసం అయితే రెండు పార్ట్ లుగా తిస్తామని, వెబ్ సిరీస్ గా అయితే సీజన్స్ గా కొనసాగిస్తామని తెలిపారు.