వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో అప్రూవర్ అయిన దస్తగిరి మాట్లాడుతూ వివేకానందరెడ్డిని చంపింది మేమేనని అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి అంతా ఒక్కటేనని కామెంట్లు చేశారు. నేను మాత్రమే ఈ కేసులో సాక్షినని నన్ను ఏమైనా చేస్తారనే భయంతో మీడియా ముందుకు వచ్చానని దస్తగిరి చెప్పుకొచ్చారు.
జగన్ సర్కార్ సీబీఐని కీలుబొమ్మలా ఆడిస్తోందని నాకేం జరిగినా సీఎందే బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ కేసును డీల్ చేస్తున్న అధికారులు బదిలీ అవుతున్నారని సీఎం జగన్ సీబీఐకు సపోర్ట్ ఇవ్వకుండా అడ్డు పడుతున్నాడని దస్తగిరి చెప్పుకొచ్చారు. ఎస్పీకి నేను ఫిర్యాదు చేసినా నేను చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని ఎస్పీ చెబుతున్నారని దస్తగిరి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిన వ్యక్తులలొ సీఎం జగన్ ఒకరు. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ ఎప్పుడు మాట్లాడినా నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ జగన్ పై ఆరోపణలు చేయని దస్తగిరి ఇప్పుడు ఆరోపణలు చేయడం సంచలనం అయింది. జగన్ ను టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్లు చేయిస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా జగన్ ను నిందించడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ప్రస్తుతం ప్రజలకు మేలు జరగడం మినహా ఇతర విషయాలపై దృష్టి పెట్టడం లేదు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ఆ స్కీమ్స్ ద్వారా ఎంతోమంది బెనిఫిట్ పొందారు. దస్తగిరి జగన్ ను నిందించడంలో అర్థముందా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.