వివేకా కేసు అప్రూవర్ మాటలు విన్నారా? వైసీపీ మంత్రులు ఏమంటారో?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భూ వివాదాల వల్లే ఈ హత్య జరిగిందని చాలామంది భావిస్తారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీకి సంబంధం ఉందని ప్రచారం జరగగా ఆ ప్రచారం గురించి స్పందించడానికి సదరు ఎంపీ కానీ ఇతర వైసీపీ నేతలు కానీ ఏ మాత్రం ఇష్టపడలేదు.

వివేకానందరెడ్డి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దస్తగిరి ప్రస్తుతం క్షణమొక గండంలా గడుపుతున్నారని తెలుస్తోంది. వివేకానందరెడ్డి చనిపోవడానికి కొన్నిరోజుల ముందు ఆయన పెంపుడు కుక్క చనిపోయింది. అయితే తన విషయంలో కూడా అదే విధంగా జరుగుతోందని రెండు రోజుల క్రితం తన పెంపుడు కుక్క చనిపోయిందని దస్తగిరి చెబుతున్నారు. తాజాగా తనకు గన్ మేన్లను కూడా మార్చడంతో దస్తగిరి భయపడుతున్నారు.

తనకు ఏదైనా జరగరానిది జరిగితే ఏపీ సీఎం వైఎస్ జగన్ బాధ్యత వహించాలని దస్తగిరి కామెంట్లు చేయడం గమనార్హం. అకస్మాత్తుగా దస్తగిరికి గన్ మేన్లను మార్చడం గురించి జగన్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. జగన్ సర్కార్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దస్తగిరికి ఏమైనా జరిగితే ఆ ఆరోపణలను నిజమని నమ్మాల్సి వస్తుంది.

వివేకా హత్య కేసుకు సంబంధించి అసలు నిందితులెవరో తేల్చి వాళ్లకు శిక్ష పడే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తే జగన్ సర్కార్ పై ప్రజల్లో మరింత మంచి అభిప్రాయం కలుగుతుంది. జగన్ సర్కార్ వల్లే ఈ కేసు అంతకంతకూ ఆలస్యమవుతోందనే ఆరోపణలు సైతం వినిపిస్తూ ఉండటం గమనార్హం. దస్తగిరి కామెంట్లపై వైసీపీ మంత్రులు ఏమంటారో చూడాల్సి ఉంది.