‘కట్ డ్రాయర్’ రాజకీయం.! సిగ్గు పడండి ఇకనైనా.!

నడి రోడ్డు మీద కట్ డ్రాయర్‌తో నిలబెడ్తానంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి కొడాలి నానిని విమర్శించే క్రమంలో. దానికి కౌంటర్ ఎటాక్ వైసీపీ నుంచి కూడా అంతే స్థాయిలో వచ్చింది. పేర్ని నాని రంగంలోకి దిగారు వైసీపీ నుండి.

పోసాని కృష్ణమురళి కూడా ‘కట్ డ్రాయర్’ మీద తనదైన స్టయిల్లో నారా లోకేష్‌పైన విమర్శలు చేసేశారు. వీళ్ళు విమర్శిస్తోంటే వాళ్ళకెలా వుందో.. వాళ్ళు విమర్శిస్తోంటే వీళ్ళకెలా వుందోగానీ.. వింటున్న సాధారణ ప్రజానీకానికి మాత్రం చాలా అసహస్యంగా వుంటోంది. చాలా చాలా అసహ్యంగా మారిపోతోంది పరిస్థితి.

అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవిలో వున్నారు. పార్టీ నేతల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇటు సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత హోదాలో వున్నారు.. ఆయనా బాధ్యత తీసుకోవడంలేదు.

కొడుకుని అదుపులో పెట్టుకోలేకపోతున్న తండ్రి.. పార్టీ ముఖ్య నేతల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్న ముఖ్యమంత్రి.. వెరసి పరిస్థితి నానాటికీ మరింత అధ్వాన్నంగా తయారవుతోంది ఇరు పార్టీల్లో.

ప్రజలు గనుక, ఇలాంటి రాజకీయాలపై తిరగబడితే పరిస్థితి ఎలా వుంటుంది.? రెండు పార్టీల నేతల్నీ, ‘గుడ్డలూడదీసి’ (వాళ్ళ భాషలోనే) తరిమికొట్టే పరిస్థితి రావొచ్చు. ఇక్కడ జనసేన పార్టీ తక్కువేం లేదు. ఆ పార్టీ నాయకులూ హద్దులు దాటేస్తున్నారు.

మనం వున్నది ప్రజాస్వామ్య దేశంలో.! ఇక్కడ హక్కులే కాదు, అందరికీ బాధ్యతలు కూడా వుంటాయ్.! రాజకీయ నాయకులు బాధ్యత మరిస్తే, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. అయినా, రాజకీయ నాయకులకి ఈ ‘కట్ డ్రాయర్ల’ పిచ్చేంటి.?

#@AkBigNews కట్ డ్రాయర్ పై ఊరేగిస్తా : నారా లోకేశ్