టీడీపీ, జనసేనలకు కాపీ పథకాలే దిక్కా.. ఈ పార్టీలకు మరో ఆప్షన్ లేదా?

దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతూ ఉండటం చర్చనీయాంశమైంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ పార్టీలకు భవిష్యత్తు ఉండదని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అయితే అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏం చేస్తామనే ప్రశ్నకు టీడీపీ, జనసేన సమాధానం చెప్పలేకపోతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న పథకాలే దిక్కు అని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఈ పార్టీలకు మరో ఆప్షన్ కూడా లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయడం మాత్రమే ఈ పార్టీలకు ఆప్షన్ గా మిగిలిందని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త స్కీమ్స్ ను అమలు చేయడం సులువే అయినా అందుకు సంబంధించి రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీమ్స్ ను మించి ఈ స్కీమ్ ఉండాలి.

అదే సమయంలో జగన్ స్కీమ్ కు కాపీలా ఉండకూడదు. ఇలా జరిగితే మాత్రమే టీడీపీ, జనసేన అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇలా చేయడం సులువా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. అదే సమయంలో జగన్ సర్కార్ పథకాలను అమలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై విమర్శలు చేస్తున్న పార్టీలు తమ పార్టీలు అధికారంలోకి వస్తే ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తాయో చెప్పాల్సి ఉంది.

వైసీపీ పథకాలు టీడీపీ, జనసేనలను ఊహించని స్థాయిలో టెన్షన్ పెడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీపై విమర్శించడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోని టీడీపీ, జనసేన 2024 ఎన్నికల గెలుపు కోసం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.