బ్రేకింగ్ : మెత్తబడ్డ జేసీ దివాకర్ రెడ్డి ఎందుకంటే?

అవిశ్వాస తీర్మానంలో పాల్గొననని మొండికేసిన అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి మెత్తబడ్డారు. సీఎం చంద్రబాబు జెసితో ఫోన్ లో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాలని, ఏవైనా విషయాలు ఉంటే అవిశ్వాస తీర్మానం తర్వాత మాట్లాడుదామని చెప్పారు. దీంతో జేసి కాస్త వెనక్కు తగ్గారు. రేపు ఢిల్లికి వెళ్తానని, ఓటింగ్ లో పాల్గొంటానన్నారు. నేను ఎవ్వరిని బెదిరించలేదని, నా వల్ల పార్టీకి మచ్చ రావడం ఇష్టం లేదన్నారు. రాజీనామా సంగతి రేపు సాయంత్రం మాట్లాడుతానని జేసి తెలిపారు.